Margadarshi case: మార్గదర్శి కేసులో రామోజీరావుకు కొత్త తలనొప్పులు

Margadarshi case: పచ్చళ్ళు, పేపర్, చిట్టీలు.. ఇలా డిఫరెంట్ కాంబినేషన్లలో వ్యాపారాలు ప్రారంభించి తెలుగు నాట తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగాడు చెరుకూరి రామోజీరావు అలియాస్ ఈనాడు రామోజీరావు. చివరకు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా తన వద్దకు వచ్చేంత తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అలాంటి రామోజీరావు నేడు జగన్ దెబ్బకు కకావికలం అయిపోతున్నాడు. నాడు అతని తండ్రి మొదలుపెట్టిన ఆపరేషన్ రామోజీరావును ఇప్పుడు జగన్ పూర్తి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే రామోజీరావుకు గుండెకాయ లాంటి మార్గదర్శి చిట్ […]

Written By: Bhaskar, Updated On : March 15, 2023 12:49 pm
Follow us on


Margadarshi case: పచ్చళ్ళు, పేపర్, చిట్టీలు.. ఇలా డిఫరెంట్ కాంబినేషన్లలో వ్యాపారాలు ప్రారంభించి తెలుగు నాట తిరుగులేని వ్యాపారవేత్తగా ఎదిగాడు చెరుకూరి రామోజీరావు అలియాస్ ఈనాడు రామోజీరావు. చివరకు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా తన వద్దకు వచ్చేంత తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అలాంటి రామోజీరావు నేడు జగన్ దెబ్బకు కకావికలం అయిపోతున్నాడు. నాడు అతని తండ్రి మొదలుపెట్టిన ఆపరేషన్ రామోజీరావును ఇప్పుడు జగన్ పూర్తి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే రామోజీరావుకు గుండెకాయ లాంటి మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థల మీద ఏకకాలంలో దాడులు చేస్తున్నాడు. సిఐడి అధికారుల దెబ్బకు మార్గదర్శి సంస్థలు మూసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే నలుగురిని ఏపీ సిఐడి అధికారుల బృందం అరెస్టు చేసింది. వారిని న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టింది. అంతేకాదు ఈ కేసులో ఏ 1గా చెరుకూరి రామోజీరావు, ఏ 2 గా చెరుకూరి శైలజను పేర్కొన్నది.. అయితే రామోజీరావు, శైలజ కోర్టుకు వెళ్లడంతో వారికి ఊరట లభించింది.

అయితే మార్గదర్శి సంస్థల తనిఖీల్లో పలు శాఖల బ్రాంచ్ మేనేజర్లని ఏపీ సిఐడి శాఖ అరెస్టు చేసింది. ఇప్పుడు ఇదే రామోజీరావుకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అరెస్ట్ అయిన వారిలో విశాఖపట్నం ఫోర్ మెన్ కామినేని రామకృష్ణ, రాజమండ్రి ఫోర్ మెన్ సత్తి రవి, విజయవాడ లబ్బీపేట ఫోర్ మెన్ శివరామకృష్ణ ఉన్నారు. అయితే వీరిని ఏపీ సిఐడి అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మార్గదర్శి సంస్థల ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంస్థలో ఉద్యోగులుగా చేరడమే మా వాళ్ళు చేసిన పాపమా? యజమాని చెప్పినట్టే కదా చేశారు? ఇప్పుడు ఎందుకు అరెస్టు చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శి చిట్స్ వ్యవహారాల్లో ఏవైనా అవకతవకలు ఉంటే యాజమాన్యాన్ని ప్రశ్నించాలి గాని, అందులో చేస్తున్న ఉద్యోగులను వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఇక తనిఖీల్లో భాగంగా మార్గదర్శి సంస్థల్లో పలు అక్రమాలను గుర్తించినట్టు ఏపీ సిఐడి అధికారులు అంటున్నారు.. మార్గదర్శలోని పలు విభాగాల్లో సుగులు ఉన్నాయని చెబుతున్నారు. చిట్టి సభ్యుల స్థానంలో వేల చిట్లు ఏర్పాటుచేసి మార్గదర్శి సంస్థ పేరు రాశారు. ఇక నిబంధనల మేరకు చిట్టి పాడిన వ్యక్తులకు పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. చిట్లలో తనకు వచ్చే కొద్దిపాటి డిస్కౌంట్ల మొత్తాన్ని దాదాపు అన్ని చిట్లలోనూ డూప్లికేట్ చేసి చూపించి.. దాన్నే ఖాతాదారుల సొమ్ముగా పేర్కొంటున్నారు. దీన్ని మొత్తం చూస్తే ఒక గొలుసుకట్టు వ్యవహారం లాగా కనిపిస్తోందని సిఐడి అధికారులు అంటున్నారు. ఈ గొలుసులో ఏ చిన్న లింకు తెగినా అది సంస్థ దివాలకు దారి తీసే అవకాశం ఉందని సిఐడి అధికారులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే చిట్ సభ్యుల సంఘం వాళ్లకు ఇవ్వాలని పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు.

అంతేకాదు ఇంత పెద్ద సంస్థ నిర్వహిస్తున్నప్పుడు వేరువేరు బ్యాంక్ ఖాతాలు కాకుండా ఒక్క బ్యాంకులో మాత్రమే ఖాతా కొనసాగిస్తున్నారు. అది కూడా అన్నింటికీ కలిపి.. వాటిలో కూడా డబ్బులు ఇష్టం వచ్చినట్టు మళ్లిస్తున్నారు.. ఇన్వెస్ట్మెంట్ రూపంలో గ్రూపు సంస్థల్లోకి పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్నారు. మరోవైపు మార్కెట్లో హై రిస్క్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ లోకి కూడా సభ్యుల నగదును మళ్లిస్తున్నారు. మరోవైపు కేవలం రసీదుల ఆధారంగానే చిట్ డబ్బులు సేకరించడం విశేషం. చిట్ కాల పరిమితి ముగిసినా డబ్బులు వెంటనే ఇవ్వడం లేదు. పైగా చిట్ సభ్యులు కార్యాలయాలను సంప్రదించినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారు. పైగా ఐదు నుంచి ఆరు శాతం వడ్డీ ఇస్తామని ఆశ పెడుతున్నారు. దీంతో ఖాతాదారులు ఏం చేయాలో తెలియక వెనక్కు తిరిగి వెళ్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మార్గదర్శి వ్యవహారంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. నిన్న అన్నదాత, నేడు మార్గదర్శి.. పాపం రామోజీరావు పరిస్థితి బాగోలేదు. అస్సలు బాగోలేదు.