Ramoji Rao: తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా తీరే వేరు. ఆ అక్షరాల్లో నిజాయితీ లేకపోగా.. అబద్దాలను సైతం నిజం చేయగల నేర్పరితనం వారిది. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులపై అక్షర దాడి చేయడం వారి నైజం. తాము అభిమానించే చంద్రబాబు కళ్ళల్లో ఆనందం నింపాలి. తమ సామాజిక వర్గం వారికి మార్గదర్శకంగా నిలవాలి. అందుకు ఎందాకైనా తెగించే నైజం ఎల్లో మీడియా సొంతం. చేతిలో పత్రిక, ఛానల్ ఉన్నాయి కదా అని.. అదే పనిగా విషపు రాతలు రాస్తూనే ఉన్నారు. తమ వారి అవినీతిని మాత్రం దాచేస్తున్నారు.
పోలీస్ శాఖ లో ఇటీవల ఓ స్కాం వెలుగు చూసింది. చలానాలను వసూలు చేసే సాఫ్ట్ సేవలను ఓ మాజీ డిజిపి కుటుంబ సభ్యుడు దక్కించుకున్నాడు. కేవలం రూపాయి టెండర్ తో పోలీస్ శాఖకు టెండర్ పెట్టాడు. వాహనాల చలానా ద్వారా పోలీస్ శాఖకు రావలసిన రూ.40 కోట్లు పక్కదారి పట్టించాడు. అయితే సదరు మాజీ డిజిపి జగన్కు సన్నిహితుడు. అందుకే ఆయన బంధువు టెండర్ తగ్గించుకున్నాడు. పోలీస్ శాఖకే టెండర్ వేశాడు. అయితే ఇది రామోజీ ఈనాడుకు పతాక శీర్షికన వార్త అయ్యింది. అందులో తప్పులేదు. అవినీతి జరిగితే ఇలానే స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ తన సామాజిక వర్గం చెందిన వారి విషయంలో రామోజీ రాజీ పడుతుండడం విశేషం.
తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు సుజనా చౌదరి. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూడడంతో.. రాజ్యసభ సభ్యుడు హోదాలో బిజెపిలోకి జంప్ చేశారు. అయితే ఆయన పారిశ్రామిక వ్యాప్త కూడా. ఆ అవసరాల కోసమే ఆయన బిజెపిలో చేరినట్లు ప్రచారం జరిగింది. ఆ మధ్యన ఆయన రూ.450 కోట్లను బ్యాంకులకు ఐపి పెట్టారని ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఈనాడులో ఆ వార్త ప్రచురణకు కూడా నోచుకోలేదు. కనీసం చిన్న వార్త కూడా వేయలేదు. తాజాగా ఓ మాజీ డిజిపి కుటుంబ సభ్యుడుపై ఆరోపణలు రావడంతో పతాక శీర్షికన కథనాన్ని వండి వార్చారు. మరి అప్పట్లో సృజనా చౌదరి అవినీతి రామోజీరావుకు కనిపించలేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రామోజీరావుకు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. చంద్రబాబు పల్లకి మోయడం ప్రీతికరం. అత్యవసరంగా ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావాలి. చంద్రబాబు సీఎం కావాలి. తెల్లవారు లేచింది మొదలు జగన్ ప్రభుత్వం పై విషపు రాతలతో రెచ్చిపోతుంటారు. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తుండడంతో జగన్తో పాటు ఆయన సన్నిహితులపై పచ్చ రాతలతో విరుచుకుపడుతున్నారు. అయితే ఒక రాజకీయమే కాదు, ఆయనలో కులాభిమానం సైతం అధికం. అందుకే సుజనా చౌదరి లాంటి వాళ్లు ఆయనకు మంచివాళ్లుగా కనిపిస్తున్నారు. వారి వందల కోట్ల అవినీతి వారికి కనిపించడం లేదు. అదే ప్రత్యర్థిలో రూపాయి అవినీతి కనిపించినా భూతద్దంలో పెట్టి మరి వెతుకుతున్నారు. దటీజ్ రాజ గురువు రామోజీ.