RGV Vs Chandrababu: ఎమోషనల్స్ విషయంలో కేలుక్యులేషన్లు ఉండని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎప్పటికప్పుడు అభిరుచులు మార్చుకుంటూ ముందుకు సాగుతున్న ఆర్జీవీ చివరాఖరుకు పోర్ను తరహాలో వీడియోలో కనిపించి కనువిందు చేస్తున్నారు. మందూ, పక్కనే మగువతో వినోదం పంచుతున్నారు. అదే సమయంలో పొలిటికల్ సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు విషయంలో మాత్రం తన గడసరి తనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలో చంద్రబాబుపై అయినదానికి కానిదానికి విమర్శలు గుప్పిస్తూ ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. వ్యతిరేక భావనను నరనరాన నింపుకున్నారు.ఆయనపై చేసిన సినిమాల ప్రభావమో.,. మరే ఇతర కారణాలో తెలియదు కానీ బాబు అంటేనే అంతెత్తున ఎగిరిపడుతున్నారు.
ఆ ట్విట్లకు రిప్లయ్..
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన సంగతి తెలిసిందే, దీనిపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. దీంతో ఇది టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అయితే సందిట్లో సడేమియా అన్నట్టు రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. ఏకంగా చంద్రబాబు ట్విట్లకు రిప్లయ్ ఇస్తున్నారు. అనుచిత కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతటా ఇదే చర్చ జరుగుతోంది. అంతలా ఆర్జీవీ ట్విట్లు తెలుగునాట కాక రేపుతున్నాయి.
ఎన్టీఆర్ ను చంపలేదా?
వైసీపీ నేతలు కేవలం రజినీపై కామెంట్లు మాత్రమే చేశారని.. కానీ మీరు లెజెండరీ ఎన్టీఆర్ ను హింసించి చంపిన సంగతి ఏంటి అని చంద్రబాబును ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. అలాగే మరోక ట్వీట్ లో చంద్రబాబు ఎన్టీఆర్ కు అల్లుడైనప్పటికీ ఆయనను చంపారని కౌంటర్ వేశారు. చంద్రబాబు విషయంలో ఏమాత్రం అవకాశం దొరికినా ఆర్జీవీ ఎంటర్ కావడం ఇటీవల పరిపాటిగా మారింది. చంద్రబాబు మీద కామెంట్స్ చేయడం అంటే భలే సరదా. ఆయన మీద హాట్ హాట్ కామెంట్స్ పెట్టాలంటే ఆర్జీవీ ముందుకు వచ్చేస్తారు. నిజంగా ఆర్జీవీ కామెంట్స్ ని ఏ వైసీపీ నేత కూడా పెట్టలేడు అసలు అలాంటి ఆలోచన చేయడానికి సహసించరు. అటువంటిది రామ్ గోపాల్ వర్మ నిర్భయంగా ముందుకు రావడం మాత్రం సాహసమనే చెప్పుకోవాలి.
వైసీపీ అధికార ప్రతినిధిగా మారి..
ఎప్పటికప్పుడు అభిమానించే వ్యక్తులు, ఇష్టాలు, అభిరుచులను మార్చుకునే ఆర్జీవీ జగన్ ను ఇష్టుడిగా మార్చుకోవడం మాత్రం విశేషమే. తాడేపల్లి ప్యాలెస్ వద్ద తరచూ తారసపడే ఆర్జీవీ లెక్కలు తేల్చుకునే ఇటువంటి ట్విట్స్ చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ రిచ్ లైఫ్ అనుభవిస్తున్నారు. లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దాని వెనుక తాడేపల్లి లెక్కలున్నాయా అన్నది అనుమానం కలుగుతోంది. అందుకే ఆయన వైసీపీ అధికార ప్రతినిధిగా మారిపోయారాన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఆదిలో ఆర్జీవీ మాటలను ఆసక్తిగా వినే వారు ఇప్పుడు లేకుండా పోతున్నారు. ఆయన సినిమాల మాదిరిగానే ట్విట్లు కూడా ఇలా వచ్చి.. అలా ఫేడవుట్ అవుతున్నాయి.