https://oktelugu.com/

పార్లమెంట్ కు రాహుల్ గాంధీ ఎలా వచ్చారో తెలుసా?

రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. కేంద్రంలో బీజేపీని గద్దె దించడానికి మూడో కూటమి ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఫార్టీలో కూడా దూకుడు పెరుగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి దారులు వెతుకుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలతో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రజాసమస్యలసై దృష్టి సారించింది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సంకల్పించింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 26, 2021 1:00 pm
    Follow us on

    Rahul Gandhi Parliamentరాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. కేంద్రంలో బీజేపీని గద్దె దించడానికి మూడో కూటమి ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఫార్టీలో కూడా దూకుడు పెరుగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి దారులు వెతుకుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనలతో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ప్రజాసమస్యలసై దృష్టి సారించింది. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సంకల్పించింది.

    పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్ పై వచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు కలిగే నష్టాల గురించి తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. కొద్దిరోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమంలో రాహుల్ గాంధీ సైతం కీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాతల ఆక్రందనలు వినిపించేందుకు రెడీ అయ్యారు.

    కేంద్రం సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదని శపథం చేశారు. అన్నదాతల గళాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోంది. ఈ నేపథ్యంలో వారి తరఫున పోరాడి వారి హక్కులు సాధించేందుకు కాంగ్రెస్ భావిస్తోంది. సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు విశ్రమించేది లేదని చెబుతున్నారు. బడా వ్యాపార వేత్తల కోసం చట్టాలు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరి ప్రయోజనాల కోసం అందరి హక్కులను పణంగా పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

    పార్లమెంట్ సమావేశాలు ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో ఫోన్ల ట్యాపంగ్ వ్యవహారం కూడా పెను ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఉభయ సభలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో సాగు చట్టాలు, కరోనా అంశాలపై విపక్షాలు నిరసన తెలుపుతున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఉపక్రమిస్తోంది. రైతుల పక్షాన నిలిచి వారి ప్రయోజనాలే లక్ష్యంగా పోరాడేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది.