https://oktelugu.com/

Rachakonda CP : రాచకొండ సీపీ ఫోన్ నీ ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించని మహిళ కానిస్టేబుల్..సీపీ రియాక్షన్ ఇదీ

Rachakonda CP : రూల్స్ ఎక్కడైనా రూల్స్ నే. మోడీ అయినా కేసీఆర్ అయినా.. సామాన్య పౌరుడు అయినా అందరూ పాటించాల్సిందే. అయితే పోలీసులు అన్నాక కాస్తంత అధికారం.. అందరిలోకి చెలామణీ లాంటివి ఉంటాయి. ఇక కమిషనర్ అంటే ఆ స్థాయి వేరు. ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఏదైనా తనిఖీ చేయవచ్చు. కానీ రూల్స్ పాటించమని చెప్పే ఉన్నతాధికారులే రూల్స్ మరిచిపోయినప్పుడు ఓ కానిస్టేబుల్ గుర్తు చేసింది. ఆమె చేసిన పనికి సీరియస్ కాని సీపీ ఏకంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 6, 2023 / 12:58 PM IST
    Follow us on

    Rachakonda CP : రూల్స్ ఎక్కడైనా రూల్స్ నే. మోడీ అయినా కేసీఆర్ అయినా.. సామాన్య పౌరుడు అయినా అందరూ పాటించాల్సిందే. అయితే పోలీసులు అన్నాక కాస్తంత అధికారం.. అందరిలోకి చెలామణీ లాంటివి ఉంటాయి. ఇక కమిషనర్ అంటే ఆ స్థాయి వేరు. ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఏదైనా తనిఖీ చేయవచ్చు. కానీ రూల్స్ పాటించమని చెప్పే ఉన్నతాధికారులే రూల్స్ మరిచిపోయినప్పుడు ఓ కానిస్టేబుల్ గుర్తు చేసింది. ఆమె చేసిన పనికి సీరియస్ కాని సీపీ ఏకంగా దాన్ని ఫాలో అయ్యి ఆ లేడి కానిస్టేబుల్ ను అభినందించడం విశేషం.

    పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు తనిఖీ చేయడం కోసం ఎగ్జామ్ సెంటర్ లోకి మొబైల్ తో వెళ్లిన సీపీ చౌహన్ ను అక్కడే విధుల్లో గేటు వద్ద కాపలాగా ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ అడ్డుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

    రాచకొండ సీపీ చౌహాన్ ఫోన్ తో ఎగ్జామ్ సెంటర్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుండగా అడ్డుకొని ఫోన్ నాట్ అలో సార్ అంటూ కానిస్టేబుల్ గుర్తుచేసింది. డ్యూటీలో ఉన్న మహిళ కానిస్టేబుల్ చేసిన పనికి ఏమాత్రం సీరియస్ కాని చౌహాన్ వెంటనే రూల్స్ ఎవరికైనా రూల్స్ నే.. మంచి పనిచేశావ్ అంటూ.. తన ఫోన్ ను సైతం ఆ కానిస్టేబుల్ కే ఇచ్చి సీపీ పరీక్ష హాలులోకి వెళ్లారు.

    ఫోన్ కానిస్టేబుల్ వద్ద డిపాజిట్ చేసి లోపలకి వెళ్లిన సీపీ చౌహన్ పరీక్ష హాలును పరిశీలించారు. ఈ సందర్భంగా తనకే రూల్స్ గుర్తు చేసిన కానిస్టేబుల్ ను సీపీ అభినందించారు.

    ఎస్ఎస్.సీ పరీక్ష పేపర్ లీక్ అయిన ఈ తరుణంలో పోలీసులు మరింత అలెర్ట్ గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరినైనా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతిస్తున్నారు.