Modi In America: అమెరికాలో మోడీ.. చైనాకు చెక్ పెట్టే వ్యూహం..

Modi In America: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా వెళ్లారు. ఇక్కడ జరిగే క్వాడ్ సదస్సులో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో సమావేశమైన మోదీ ఆ తరువాత బైడెన్ తోనూ భేటి అయ్యారు. గత మార్చిలో ఆన్ లైన్ వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాలు ఇప్పుడు ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. క్వాడ్ సదస్సుల ప్రారంభంలో గ్లోబల్ సెక్యూరిటీ ప్యాక్ట్ ను ప్రకటించగా.. దీనిని AUKUS ఒప్పందం అని పిలుస్తున్నారు. ఈ ఒప్పందంపై […]

Written By: NARESH, Updated On : September 25, 2021 9:47 am
Follow us on

Modi In America: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా వెళ్లారు. ఇక్కడ జరిగే క్వాడ్ సదస్సులో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో సమావేశమైన మోదీ ఆ తరువాత బైడెన్ తోనూ భేటి అయ్యారు. గత మార్చిలో ఆన్ లైన్ వేదికగా సమావేశమైన క్వాడ్ దేశాలు ఇప్పుడు ప్రత్యక్షంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. క్వాడ్ సదస్సుల ప్రారంభంలో గ్లోబల్ సెక్యూరిటీ ప్యాక్ట్ ను ప్రకటించగా.. దీనిని AUKUS ఒప్పందం అని పిలుస్తున్నారు. ఈ ఒప్పందంపై ఇప్పటికే ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు సంతకం చేశాయి. అయితే క్వాడ్ నేతలు నేరుగా చైనా గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా ఆ దేశాన్ని ఎదుర్కోవడానికి పరస్పర సహకారం కోసం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

క్వాడ్ లో ఉన్న మిగతా నాయకుల కంటే నరేంద్రమోదీయే చైనా గురించి ఎక్కువ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చైనాతో సరిహద్దు ఎక్కువగా పంచుకుంటున్న దేశం భారత్ మాత్రమే. గత గ్వాలియర్ ఘటనలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది కూడా. అయితే ఇప్పుడు క్వాడ్ సదస్సుల ద్వారా భారత్ లబ్ధిపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అందువల్ల భారత్ ఇతర దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు బహుళ పక్ష ఫోరమ్ లలో చురుగ్గా పాల్గొంటోంది. ఇప్పుడున్న పరిస్థుతుల్లో సాంకేతిక, సైనిక సహకారం కోసం భారత్ కు ఈ సమావేశాలు ఉపయోగపడవచ్చని దక్షిణాసియా కంట్రోల్ రిస్క్ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఈ క్వాడ్ సదస్సులో అనేక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ముఖ్యంగా సాంకేతిక విప్లవంలో పెను మార్పులపై చర్చించనున్నారు. 5 జీ టెక్నాలజీ వంటి అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనిపై లోతైన సహకారం ఉండే విధంగా ఒప్పందం చేసుకోనున్నారు. క్వాడ్ సదస్సులో తీసుకునే నిర్ణయాలు చైనాను రెచ్చగొట్టే విధంగా ఉండవని, దీని వల్ల భారత్ కు ఎలాంటి ఇబ్బంది ఉండవని వాషింగ్టన్ విల్సన్ సెంటర్ అదికారి తెలిపారు.

అయితే కొందరు మాత్రం ఈ సదస్సుల వలన భారత్ కు ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో భారత్ కు ఉన్న సవాళ్లు, చైనాతో విభేదాలను పరిష్కారం చూపించలేదంటున్నారు. పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ లో చాలా కాలంగా చైనా పెట్టుబడులు పెడుతోంది. దీని ద్వారా భారత్ కు ఇబ్బందిక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు అప్ఘనిస్తాన్ లో బీజింగ్ ప్రభావం పెరుగుతుండడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. అందువల్ల ఈ క్వాడ్ సదస్సు భారత్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందో లేదోనని అంటున్నారు.

అయితే నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో సమావేశమయ్యారు. ఆయనతో చైనా గురించి బహిరంగంగా మాట్లాడకపోయినా చైనా, అప్ఘనిస్తాన్ దేశాల పరిస్థితులను తెలుసుకోవడానికి ఒక అవకాశంగా ఏర్పడిందని నిపుణులు అంటున్నారు. అప్ఘనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులతో భారత్ కు తీవ్రవాదుల ముప్పు ఉందని, దానిని ఎదుర్కొనేందుకు అమెరికా సహకారం భారత్ తీసుకోనుంది. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ సొంత విధానంపై అమెరికాతో చర్చించింది. వీటితో పాటు వాణిజ్య ఒప్పందాలు, క్షిపణుల కొనుగోలు అంశాలు ఈ సమావేశంలో చర్చించారు..

ఇక కరోనా నివారణకు వ్యాక్సిన్ కార్యక్రమాలకు మద్దతుగా నిలిచేందుకు యూఎస్ వ్యాక్సిన్ స్టాక్ పెంచడం, భారత్ లో ఉత్పత్తి సామర్థ్యం పెంచడం వంటి అంశాల్లో సహకారంపై నరేంద్ర మోదీ చర్చకు తీసుకురానున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ల తయారీ, పంపిణీ విషయంలో క్వాడ్ ఇప్పటికే సహకారం ప్రకటించిందని వాషింగ్టన్ విల్సన్ సెంటర్ అధికారి తెలిపారు. అయితే ఈ సదస్సులతో భారత్ కు లాభమేనని, నష్టం లేదని కొందరు అంటున్నారు.