https://oktelugu.com/

Purandeswari: ఏపీలో మద్యం అవినీతిపై సిబిఐ.. స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన పురందేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియామకం తర్వాత పురందేశ్వరి వైసిపి తో పాటు టిడిపి ఫై పోరాటం చేస్తారని భావించారు. రెండు పార్టీలకు సమదూరం పాటిస్తారని చెప్పుకొచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 9, 2023 / 12:54 PM IST
    Follow us on

    Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైసీపీ సర్కార్ పై స్ట్రాంగ్ ఫైట్ కు సిద్ధమయ్యారు. ముఖ్యంగా మద్యంలో జరుగుతున్న అవినీతిని అజెండాగా తీసుకుని పోరాడుతున్నారు. మొన్న ఆ మధ్యన నేరుగా మద్యం దుకాణానికి వెళ్లి అక్కడ విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు, వాటి బ్రాండ్లు, క్రయవిక్రయాలపై ఆరా తీశారు. కేవలం నగదు లావాదేవీలు జరుగుతూ ఉండడాన్ని తప్పుపట్టారు. ఏడాదికి పాతిక వేల కోట్లకు పైగా మద్యం సొమ్ము పక్కదారి పడుతోందని ఆరోపించారు. అదంతా వైసిపి నేతల ఖాతాల్లోకి వెళుతోందని ఆరోపణలు చేశారు. సీఎం జగన్ నుంచి దిగువ స్థాయి వైసిపి నేతలంతా ఈ అవినీతిలో సూత్రధారులేనని తేల్చి చెప్పారు.

    ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియామకం తర్వాత పురందేశ్వరి వైసిపి తో పాటు టిడిపి ఫై పోరాటం చేస్తారని భావించారు. రెండు పార్టీలకు సమదూరం పాటిస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఆమె వైసీపీని బద్ధ శత్రువుగా చూస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ సర్కార్ మద్యం పాలసీపై పురందేశ్వరి మాట్లాడడం ప్రారంభించారు. గత నెల రోజులుగా మద్యం విధానం పైనే కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఏపీ సర్కార్ మద్యం పాలసీపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరడం విశేషం.ఏపీలో మద్యం అమ్ముకొని అవినీతికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తెర తీశారని ఫిర్యాదు చేశారు.గతంలో మద్యం అమ్మకాల కోసం వేలం వేసేవారని.. మద్యం దుకాణాలకు అనుమతి ఉండేదని.. ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే మద్యం అమ్మకాలను చేస్తోందని.. అది కూడా నూటికి 80% నగదు లావాదేవీలు జరుపుతోందని.. పెద్ద ఎత్తున మద్యం సొమ్ము తో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని పురందేశ్వరి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

    ఒక మద్యం బాటిల్ తయారీకి 15 రూపాయలు అవుతుంటే.. దానిని 600 నుంచి 800 రూపాయల వరకు విక్రయిస్తున్నారనిపురందేశ్వరి ఆరోపించారు.ఒక్క మద్యం అమ్మకాల ద్వారా ఏడాదికి 57,600 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని.. కానీ కేవలం 32 వేల కోట్లు మాత్రమే చూపిస్తున్నారని.. మిగతా పాతిక వేల కోట్లు వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నట్లు పురందేశ్వరి అమిత్ షాకు స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ చేపడితే నిజాలు నిగ్గు తేలుతాయని పురందేశ్వరి వివరించినట్టు సమాచారం.

    ఏపీలో మద్యం అమ్మకాలపై చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి.ఇటీవల నాసిరకం మద్యంతో చాలామంది నిరుపేదల ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.పేరుకే ప్రభుత్వ మద్యం దుకాణాలు కానీ.. ఆ దుకాణాలు నిర్వహిస్తున్నది వైసిపి నేతల షాపుల్లో, అక్కడ పనిచేస్తున్నది వైసీపీ సానుభూతిపరులే. అటు మద్యం తయారీ సంస్థలు వైసిపి నేతల బినామీ కంపెనీలేనని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి.నాసిరకం బ్రాండ్లతో పాటు ధర అమాంతం ఆకాశంలో ఉంది. మద్యంతో కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా.. అంతకుమించి వైసిపి నేతల జేబుల్లోకి వెళుతోందన్న ఆరోపణ ప్రధానంగా ఉంది. అందుకే బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ అంశంపైనే దృష్టి సారించారు. అయితే దీనిపై కేంద్రం కానీ ఫోకస్ పెడితే మద్యంఅవినీతి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.మరికేంద్ర ప్రభుత్వ చర్యలు ఎలా ముందుకు సాగుతాయో చూడాలి.