Satish Reddy: పులివెందుల.. ఈ మాట చెబితేనే వైయస్సార్ కుటుంబం గుర్తుకొస్తుంది. 1978 నుంచి ఆ నియోజకవర్గం వైయస్ కుటుంబానికి పెట్టని కోట.వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, విజయమ్మ,, జగన్మోహన్ రెడ్డి.. ఇలా ఆ కుటుంబమే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. అక్కడ తెలుగుదేశం పార్టీ నామ మాత్రమే. టిడిపి ఆవిర్భావం తర్వాత ఒక్కసారి కూడా గెలవలేదు. గట్టి పోటీ ఇచ్చిన సందర్భాలు ఒక రెండు ఉన్నాయి.ఆ గట్టి పోటీకి కారణం మాత్రం సతీష్ రెడ్డిఅనే నాయకుడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు జగన్మోహన్ రెడ్డి తోనే ఆయన నాలుగు సార్లు తలపడ్డారు. అటువంటి నాయకుడిని తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టింది. దీంతో ఆయన వైసీపీలో చేరిపోవాలని డిసైడ్ అయ్యారు.
సతీష్ రెడ్డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు, అనుచరులు ఉన్నారు. చాలాసార్లు పోటీ చేసి ఓడిపోయారని సానుభూతి ఉంది. సతీష్ రెడ్డి దూకుడు రాజకీయాలకు దూరంగా ఉంటారు. హుందాగానే రాజకీయాలు చేస్తుంటారు. దీంతో తెలుగుదేశం పార్టీ పక్కన పడేసింది. బీటెక్ రవి అనే కొత్త అభ్యర్థి దొరకడంతో సతీష్ రెడ్డి పట్టించుకోవడం మానేసింది. దీంతో గత కొంతకాలంగా సొంత వ్యవహారాలు చూసుకుంటున్న సతీష్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.
2014 ఎన్నికల్లో జగన్ 40 వేల మెజారిటీతో గెలుపొందారు. 2019లో మాత్రం 90 వేల మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సతీష్ రెడ్డి చేరికతో వైసీపీకి అదనపు బలం తోడవుతుందని భావిస్తున్నారు. బీటెక్ రవి సైతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిగానే పోరాడారు. పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ పాగా వేసేందుకు అవకాశం ఉన్న సతీష్ రెడ్డి అవగాహన రాజకీయాల వల్లే వెనుకబడిందని హైకమాండ్కుఒక అభిప్రాయం ఉంది.అందుకే సతీష్ రెడ్డిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న సతీష్ రెడ్డి వైసీపీలో చేర్చుకోవడం ఏమిటని.. ఆయనెప్పుడో వైసీపీకి అనుకూలంగా పారిపోయారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే ఈ కుటుంబం పై దశాబ్దాలుగా పోరాడారో.. అదే కుటుంబం గూటికిసతీష్ రెడ్డి చేరుతుండడం విశేషం.