YCP Leaders: పథకాలు అందిస్తున్నాం. ప్రజలకు ఉదారంగా డబ్బులు పంచుతున్నాం. అంతా సవ్యంగా ఉందనుకుంటే ప్రజల నుంచి ఈ తిరుగుబాటు ఏమిటి..సగటు వైసీపీ ప్రజాప్రతినిధుల్లో వ్యథ ఇది. ప్రజల మధ్యకు వెళుతుంటే ఛిత్కరాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకీ పరిస్థితి అంటూ అంతర్మథనం చెందుతున్నారు. ప్రజలు గౌరవించకపోయినా పర్వాలేదు.. కానీ అగౌరవపరుస్తున్నారని లోలోపల తెగ బాధపడుతున్నారు. మూడేళ్లుగా చేసిన పనులు చెప్పేందుకు ‘గడపగడపకూ ’ వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం.. కదా బ్రహ్మరథం పడతారని వైసీపీ నేతలు భావించారు. సాదర స్వాగతాలు, ఆత్మీయ పలకరింపులు ఉంటాయనుకున్నారు. కానీ ప్రజలు గడపకు రానించడం లేదు. ముఖాన్నే తలుపులు వేస్తున్నారు. తిట్ల దండకానికి పూనుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రజాప్రతినిధులకు నిలదీతలు తప్పడం లేదు. శనివారం కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డికి ప్రజలు చుక్కలు చూపించారు. బైచేగిరిలో పర్యటించారు. గ్రామంలో ఎక్కడకు వెళ్లినా మహిళలు ఎదురుతిరుగుతూ మాట్లాడారు. కనీస గౌరవం ఇవ్వక పోవడంతో బాధపడడం ఆయన వంతైంది.

తప్పని నిలదీతలు..
‘రెడ్డీ.. మీరు చూస్తున్న ఈ దారిలో ఎవరైనా నడవగలరా? ఈ వీధిలో నివా సం ఉంటున్న పది కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని ఎలా మోసుకెళ్లాలి? ఈ మధ్య కాలంలో మా అమ్మ చనిపోతే ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎన్ని అవస్థలు పడ్డామో ఊరం తా చూసింది. మరో దారిలో శ్మశాన వాటికకు తరలిద్దామంటే ఆ దారిలో ఉన్న వారంతా అడ్డు చెబుతున్నారు. గత్యంతరం లేక మీరు చూస్తున్న ఈ మురుగు కాల్వ గుం డానే మా అమ్మ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాం. అయినా అధికారులు, నాయకులు పట్టించుకోలేదు’’ అని సరస్వతి అనే మహిళ…ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని నిలదీసింది. ‘ఈ రోడ్డు వేయాలని అడిగీ…అడిగీ… మేమే ముసలివాళ్లమయ్యామ’ని జయమ్మ, శ్రీదేవిలు వాపోయారు.‘‘మేం పక్కా వైసీపీ అభిమానులం. కానీ, అన్ని అర్హతలున్నా మాకు ప్లాట్ ఇవ్వలేదు. మాకున్న సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటామంటే కూడా పట్టా ఇవ్వలేదు. నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందాం.
Also Read: YCP MLC Udaya Bhaskar: ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఏ1 నిందితుడిగా కేసు నమోదు
పట్టా ఇవ్వకున్నా అప్పు చేసి ఇల్లు నిర్మించుకుంటున్నాం. మన ప్రభుత్వం వచ్చినా ప్రయోజనం మాత్రం లేదు’’ అని మొలగవల్లి లక్ష్మి అనే మహిళ ఎమ్మెల్యేతో పాటు రెవెన్యూ, హౌసింగ్ అధికారులను నిలదీసింది. ఎనిమిది నెలల క్రితం మా పొలంలో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ట్రాన్స్‌ఫార్మర్ కింద నావి నాలు గు బోర్లు ఉన్నాయి. ఈ నాలుగు బోర్ల ద్వారా ఏడెకరాల భూమి సాగు చేసుకుంటున్నా. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేయాలని మీ చుట్టూ, విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి నాలుగు జతల చెప్పులు తెగిపోయాయి. ట్రాన్స్‌ఫార్మర్ మాత్రం రాలేదు. పంటలు పోయి… గత ఏడాది రూ.ఆరు లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఈ ఏడాది వర్షంపై ఆధారపడి దాదాపు రూ. రెండు లక్షలు ఖర్చు చేసి పత్తి వేశాను. ఇప్పటికైనా ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించండి. లేకపోతే మాతో కాదని చెప్పండి. నేనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించుకుంటాను’ అని రైతు మాణిక్యరెడ్డి నిలదీశారు.

పోస్టులు అమ్ముకుంటున్నారు..
పార్టీ కోసం కష్టించి పనిచేశాం… అంగన్‌వాడీ ఆయా పోస్టును ఇప్పించమని బతిమాలాం..సొమ్ములిస్తేనే పోస్టు ఇస్తామని స్థానిక నేతలు హుకుం జారీచేశారు’’ అని కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం చిరతపూడికి చెందిన వైసీపీ మహిళా కార్యకర్త దాసరి భార్గవి.. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును నిలదీసింది. శనివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కోసం చిరతపూడికి వచ్చిన ఎమ్మెల్యేను సమస్యలపై ప్రశ్నించింది. ‘‘నాకు ఇద్దరు కుమార్తెలు. సొమ్ములు ఇస్తేనే అంగన్‌వాడీ ఆయా పోస్టును మంజూరు చేస్తున్నామని మన పార్టీ నేతలే చెబుతున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండా పోస్టులు అమ్ముకోవడం సాధ్యమేనా?’’ అని ముఖం మీదే అడిగేసింది. పోస్టు నియామకంపై అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పి.. ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Also Read:Minister Amrnath And MLA Kannababu Raju: మారు వేషంలో ఏపీ మంత్రి, ఎమ్మెల్యే… పరువుతీసిన జనాలు