Modi punjob Tour: ప్రధాని మోడీ ఎప్పుడూ శాంతంగా ఉంటారు. ప్రత్యర్థుల విమర్శలపై కూడా సావధానంగా సమాధానమిస్తారు. లేదంటే ఆ విమర్శలపై సెంటిమెంట్ రగిలించి ఓట్లు పొందుతారు. ‘ఛాయ్ వాలా’, సామాన్యుడు ఇలా పుట్టినవే.. అయితే ఈసారి మాత్రం ఓ రాష్ట్ర సీఎం వ్యవహరించిన తీరుకు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నరేంద్రమోడీలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

పంజాబ్ లో భద్రతా వైఫల్యంతో ఓ ఫ్లైఓవర్ పై దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని నరేంద్రమోడీ చిక్కుకుపోయారు. దీంతో ఈ అవమానం భరించలేక పంజాబ్ లో తన పర్యటన, బహిరంగ సభను వాయిదా వేసుకొని వెనక్కి వెళ్లి ఎయిర్ పోర్టుకు చేరుకొని ఢిల్లీకి వెళ్లిపోయారు.
ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడి అధికారులతో మోడీ మాట్లాడుతూ.. ‘మీ సీఎంకు కృతజ్ఞతలు.. కనీసం నేను భఠిండా ఎయిర్ పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఎయిర్ పోర్టు అధికారులు బయటపెట్టారు.
పంజాబ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఓ బహిరంగ సభలో పాల్గొనడానికి మోడీ వచ్చారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలిక్యాప్టర్ లో కాకుండా రోడ్డు మార్గం ద్వారా బయలు దేరారు. అయితే మోడీ ప్రయాణాస్తున్న ఓ ఫ్లైవర్ వద్ద ఆందోళనకారులు రహదారిని బ్లాక్ చేశారు. దీంతో మోడీ ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పైనే ఉన్న మోడీ తన పర్యటనను రద్దు చేసుకొని తిరిగి ఎయిర్ పోర్టు ద్వారా ఢిల్లీ చేరుకున్నారు.
దీనిపై కేంద్రహోంశాఖ, బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. పంజాబ్ పోలీసుల వివరణ కోరారు. చర్యలకు ఉపక్రమించారు. పంజాబ్ లోని కాంగ్రెస్ సీఎం కుట్రపూరితంగా ప్రధానిని అవమానించారని ఆరోపించారు. కానీ ఎప్పుడూ శాంతంగా ఉండి మోడీనే ఇంత సీరియస్ అయ్యారంటే ఆయన ఎంత అవమానభారంతో వెనక్కి వచ్చాడో అర్థం చేసుకోవచ్చు.