https://oktelugu.com/

బూతులు తిడుతూ పోసాని ఇంటిపై రాళ్లతో విరుచుకుపడ్డ దుండగులు

జనసేనాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేసిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బూతులతో తిడుతూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇంటిపై రాళ్లు, ఇటుకలు రువ్వారు. ఏడు, ఎనిమిది మంది వరకు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.  దాడి సందర్భంగా పోసానికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినదించినట్టు కూడా తెలుస్తోంది. హైదరాబాద్ అమీర్ పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ లో […]

Written By: , Updated On : September 30, 2021 / 12:26 PM IST
Follow us on

జనసేనాని పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యక్తిగత విమర్శలు చేసిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. బూతులతో తిడుతూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇంటిపై రాళ్లు, ఇటుకలు రువ్వారు. ఏడు, ఎనిమిది మంది వరకు దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.  దాడి సందర్భంగా పోసానికి వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ నినదించినట్టు కూడా తెలుస్తోంది.

హైదరాబాద్ అమీర్ పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ లో నివాసం ఉంటున్న పోసాని ఇంటిపై కొందరు దుండగులు రాళ్లు విసిరి ఆయన ఇంటి అద్దాలు, డోర్లు పగుల కొట్టినట్టు సమాచారం. అయితే ఈ షాకింగ్ ఘటనతో వాచ్ మన్ కుటుంబ సభ్యులు భయాందోళన చెందారు. ఈ రాళ్ల దాడి సమయంలో పోసాని గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ అక్కడ లేనట్టుగా తెలుస్తోంది.

గత ఎనిమిది నెలలుగా మరో చోట పోసాని కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఈ ఘటనపై సంజీవరెడ్డి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాచ్ మెన్. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పోసాని ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

కాగా గత మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పోసాని కృష్ణమురళి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పోసాని ఇంటిపై దాడి జరగడం సంచలనంగా మారింది.

గుర్తు తెలియని వ్యక్తులు పోసాని ఇంట్లోనే ఉన్నాడని భావించి బూతులు తిడుతూ రాళ్లు విసిరారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.