PM Modi Picked Up Litter: వేయి మాటలు చెప్పేకంటే ఒక పని చేసి చూపించడం మేలు. మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ఇదే చెప్పేవారు. ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు అనే నానుడిని నిజం చేస్తూ స్వచ్ఛతకు పెద్దపీట వేయాలని చెబుతున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో స్వయంగా పని చేస్తూ ఇతరుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ప్రధాని తన చేతుల్తో చెత్త తీసివేస్తూ కనిపించారు. దీంతో స్వచ్ఛతకు పెద్దపీట వేయాలని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రత పాటించాలని సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. భవిష్యత్ తరాలకు బాసటగా నిలిచేందుకు అందరు ముందుకు రావాలని సూచించారు.

ఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిల్ కారిడార్ లో ప్రధాని చెత్త తొలగించడం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారుతోంది. దేశ ప్రజలకు ఎప్పుడు సందేశమిచ్చే ప్రధాని స్వయంగా తానే చెత్తను తొలగిస్తూ కనిపించడంతో అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత పాటించాలని తన చేతల ద్వారా సూచిస్తున్నారు. దేశ ప్రజలు పరిశుభ్రత వహిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని హితవు పలుకుతున్నారు.
Also Read: Uttarandhra Cashew Nut: జీడిపప్పుకు ఉత్తరాంధ్ర ఎందుకు ఫేమస్ అయ్యింది
ఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిల్ కారిడార్ లో భాగంగా సొరంగం తనిఖీ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని స్టేడియంలోకి వస్తుండగా ఓ చోట ఉన్న చెత్తను గమనించారు. వెంటనే దాన్ని అక్కడి నుంచి తీసి చెత్త బుట్టలో వేసి తన విధి నిర్వహించారు. దీంతో సగటు భారతీయుడికి ఆయన అలాగే చేయాలని చెప్పినట్లు అవుతోంది. దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రాధాన్యం చూపాలని చెబుతున్నారు.

దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని చెబుతున్నారు. స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్నామని వ్యాఖ్యానించారు. మాటలు చెప్పడం కన్నా చేతలు చూపించడమే తమ ధ్యేయం అని అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛతను ప్రాధాన్యతగా గుర్తించి తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని గుర్తు చేశారు. దీంతో ప్రధాని మోడీ తన బాధ్యతను గుర్తుంచుకుని సేవ చేయడం ఎంత గొప్ప పనో అర్థమవుతోంది.
[…] […]