Homeజాతీయ వార్తలుPM Modi: మోడీ ఆశ పడుతున్నాడు.. మేలుకో తెలంగాణ వాసి

PM Modi: మోడీ ఆశ పడుతున్నాడు.. మేలుకో తెలంగాణ వాసి

PM Modi: రాజ‌ధాని లేని రాష్ట్రం ఆంధ్రా. ఉమ్మడి రాజ‌ధాని గా హైద్రాబాద్ ఉన్నా అది కూడా 2024తో ముగుస్తుంది. తరువాత ఆ ప్రాంతంపై మ‌న‌కు ఎటువంటి అధికారం ఉండ‌దు. రాజ‌ధాని విష‌యంలో అప్పుడు చంద్ర‌బాబు కానీ.. ఇప్పుడు జ‌గ‌న్ కానీ డ్రామానే న‌డిపారు. అమరావతి పేరుతో పంట‌లు పండే భూములు లాక్కొన్నాడు చంద్ర‌బాబు. వాళ్లంతా ఇప్పుడు ఏడుస్తున్నారు. అస‌లు రాజ‌ధాని అంటే ఏంటి అన్న ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తాడు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అనే సీనియర్ మంత్రి. ఇది ఇంకా తెలివి. మేం పీపుల్స్ క్యాపిటల్ నిర్మిస్తామ‌ని చెప్పాడు. అన్నీ చెప్పి ఆఖ‌రికి విశాఖ కేంద్రంగా జ‌గ‌న్ కు ఇల్లు క‌ట్టి ఇచ్చాడు ధ‌ర్మాన. ఇంకేం రేపో మాపో రిషి కొండ దారుల్లో సీఎం ద‌ర్శ‌న‌మిస్తాడు.

పోనీలే..ఏపీ కి మూడు రాజ‌ధానుల గోల త‌ప్పిపోయింది. బాగుంది. ఇప్పుడు తెలంగాణ వంతు వ‌చ్చింది. బాగా అభివృద్ధి చెందిన హైద్రాబాద్ న‌గ‌రి అన్న‌ది తెలంగాణ‌కు ఎంతో కీల‌కం. ఆర్థికంగా కూడా ఎంతో అవ‌సరం. సామాజిక ఎదుగుద‌ల,ఉన్న‌తి అన్ని ప్రాంతాల‌కు అతీతంగా అక్క‌డ ఉంది. ఇప్పుడు ఇవ‌న్నీ చూసి ఈ తొమ్మిదేళ్ల‌లో కేసీఆర్ చేసిన డెవ‌ల‌ప్మెంట్ చూసి హైద్రాబాద్ అంటే మ‌న‌సు పారేసుకున్నాడు మోదీ. అలానే ముంబ‌యిని కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాన‌ని అంటున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ పై అదే ఆలోచనతో ఉన్నాడు.అంటే సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్నీ ఇక‌పై అడ్డుక్కు తిన‌డ‌మే త‌ప్ప మ‌రో దారి లేదు. సారీ టు సే లైక్ దిస్. యూటీ చేస్తారో లూటీ చేస్తారో మీ ఇష్టం రా నాయ‌నా ! ఇప్పుడు క‌నుక సీమోళ్లు సీన్లోకి వ‌స్తే క‌థ అదిరిపోద్ది. ఎలానూ వాళ్లు రాయ‌ల తెలంగాణ అన్న‌ది తెర‌పైకి ఎప్పుడో తెచ్చారు. అదే ఇప్పుడు కూడా అంటే మోదీ ఏమంటాడో చూడాలి.

మనం మనం కొట్టుకు చచ్చాం రా బాబు. ఇప్పుడు మనపై మోడీ వాలుతున్నాడు. అమ్మో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచక్కా పాలించేస్తున్నాయి. వీటిని ఇలానే వదిలేస్తే ఢిల్లీని వెతుక్కుంటూ వచ్చేస్తాయని భావిస్తున్నాడు. ఆల్రెడీ ఏపీని దెబ్బేశాం.. ఇక మిగిలింది తెలంగాణ వంతే. వీరిని కూడా విచ్చిన్నం చేద్దాం. అప్పుడెప్పుడో మా పటేల్ మీకు స్వేచ్ఛ కల్పించాడు.. నేను వచ్చి మీ బతుకును బాగు చేస్తానని తెలివైన మాటలతో తెలంగాణ సమాజాన్ని బురిడీ కొట్టిస్తున్నాడు. అక్కడ చంద్రబాబు, బుడ్డోడు జగన్నే బురిడీ కొట్టించాను.. ఏపీ ప్రజలకు ఆలోచన లేకుండా చేశాను.. ఇప్పుడు తెలంగాణ ప్రజలు నాకు ఒక లెక్క అన్న చందంగా ఒక రాయి వేస్తున్నాడు. ముచ్చటైన మాటలతో తెలంగాణ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. హైదరాబాదులో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు పరితపిస్తున్నాడు. మేలుకో తెలంగాణవాసి మేలుకో.. మేల్కోకుంటే ముప్పు తప్పదు సుమీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version