PM Modi Pakistan Tension: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో యాత్రీకులపై ఏప్రిల్ 22న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 26 మందిని హతమార్చారు. ఈ ఘనతో భారత్‌తోపాటు యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిని నిరసగా మోదీ భారత్–పాక్ మద్య ఉన్న సిందూ జలాల ఒప్పందాన్ని హెల్డ్‌లో పెట్టింది. ఆ తర్వాత నుంచి మోదీ పాకిస్తాన్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. మోదీ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయ రాజకీయాల్లోనూ, దేశీయ శక్తి అవసరాల్లోనూ కీలకమైనది. సిందూ జలాల ఒప్పందం ప్రస్తుతం స్తంభించిన నేపథ్యంలో, భారత్‌కు కేటాయించిన 20 శాతం జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు చినాబ్ నదిపై సబల్‌పూర్ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ నిర్ణయం ద్వారా భారత్ శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాక, పాకిస్తాన్‌తో జలవివాదాల్లో వ్యూహాత్మక ఆధిక్యత సాధించాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
Also Read: ఆపరేషన్ సింధూర్ పై చర్చ : కాంగ్రెస్ ఫెయిలా? పాస్ నా?
1960లో ఒప్పందం..
1960లో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన సిందూ జలాల ఒప్పందం ప్రకారం, సిందూ నది, దాని ఉపనదులైన రావి, బియాస్, సట్లెజ్, చినాబ్, ఝీలం, ఇండస్ నదుల జలాలను ఇరు దేశాలు పంచుకోవాలి. ఈ ఒప్పందంలో చినాబ్ నది జలాల్లో భారత్‌కు 20 శాతం, పాకిస్తాన్‌కు 80 శాతం వాటా కేటాయించబడింది. అయితే, ఒప్పందంలోని క్లాజ్–6 ప్రకారం, భారత్‌లో ప్రవహించే ఈ నదుల్లో పూడిక తీసినా, జలవిద్యుత్ కేంద్రాలు నిర్మించినా పాకిస్తాన్ అనుమతి తప్పనిసరి. ఈ నిబంధన భారత్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం ఒప్పందం స్తంభించిన నేపథ్యంలో, పాకిస్తాన్ జలవనరుల వినియోగంపై అడ్డంకులు సృష్టిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైనప్పుడు నీరు విడుదల చేయకపోవడం, అనవసర సమయంలో వరదలను సృష్టించడం వంటి చర్యలతో భారత్ ఇప్పుడు పాకిస్తాన్‌పై వ్యూహాత్మకంగా ఒత్తిడి తెస్తోంది. ఈ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం సిందూ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
భారీగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు..
చినాబ్ నదిపై సబల్‌పూర్‌లో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం మోదీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రాజెక్ట్‌తో పాటు, సిందూ నదీ వ్యవస్థలో మొత్తం ఆరు జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించబడింది. ఈ కేంద్రాలు సమిష్టిగా 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ చర్య భారత్క్ శక్తి అవసరాలను తీర్చడమే కాక, పాకిస్తాన్‌పై జలవనరుల వినియోగంలో వ్యూహాత్మక ఆధిపత్యాన్ని స్థాపించే దిశగా ఒక ముందడుగు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భారత్‌కు కేటాయించిన 20 శాతం జలాలను పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు, జమ్మూ కశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరచవచ్చు. అదే సమయంలో, ఈ ప్రాజెక్టులు పర్యావరణ అనుకూల శక్తి ఉత్పత్తికి దోహదపడతాయి, ఇది భారత్ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది.
Also Read: ట్రంపూ.. నికిదేం పోయేకాలంరా అయ్యా.
ఒప్పందం పునరుద్ధరణకు ముందే..
ప్రస్తుతం సిందూ జలాల ఒప్పందం హోల్డ్‌లో ఉన్న నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం వేగవంతమైన చర్యలతో పాకిస్తాన్‌తో చర్చలు పునరుద్ధరించే నాటికి జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ వ్యూహం ద్వారా భారత్ తన హక్కులను సమర్థవంతంగా వినియోగించుకోవడమే కాక, పాకిస్తాన్‌తో భవిష్యత్ చర్చల్లో బలమైన స్థానాన్ని సంపాదించవచ్చు. అంతర్జాతీయ రాజకీయాల్లో ట్రంప్ నిర్ణయాలు, సుంకాలు, పార్లమెంటు చర్చలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వేళ, మోదీ మాత్రం సిందూ జలాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నిర్ణయం దేశ శక్తి భద్రత, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల్లో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.