
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 124ఏ ను ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపుల కోసం దుర్వినియోగం చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పులు వస్తున్నాయి. రాజద్రోహం పేరుతో కేసులు పెట్టి అరెస్టులకు పాల్పడుతున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు కేంద్రంతో పాటు సుప్రీంకోర్టుకు చేరాయి. గత ఏప్రిల్ 30న124 ఏ సెక్షన్ వాలిడిటీపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అంశంపై దృష్టి కేంద్రీకరించింది.124ఏ సెక్షన్ పై వ్యాలిడిటీపై ప్రత్యేకంగా ఓ నిపుణుల కమిటీని నియమిస్తోంది.
ఇటీవల కాలంలో ఐపీసీలోన సెక్షన్ 124ఏ ను అధికారంలో ఉన్న వారు విరివిగా వినియోగిస్తున్నారు. రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ పౌరులకు ఇచ్చారు. కానీ ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే రాజద్రోహం కేసు పెడుతూ భయపెడుతున్నారు. 124ఏ సె క్షన్ ప్రకారం హేట్ స్పీచ్ నేరమని చెబుతున్నా అసలు దానికి నిర్వచనమే లేదు. ది హేట్ స్పీచ్ అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ప్రభుత్వాలు దీన్నే ఆయుధంగా చేసుకుంటున్నాయి.
ఏపీలో ఇటీవల కాలంలో రాజద్రోహం కేసులు పెట్టడం మామూలైపోయింది. జడ్జి రామకృష్ణ, రఘురామ కృష్ణంరాజులను ఇదే కేసులో అరెస్టు చేశారు. నిజానికి గతంలో కూడా 124 ఏ సెక్షన్ కు సంబంధించిన కేసులు పెట్టడం కుదరదని సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదు. కొంత కాలం అయినా జైల్లో పెట్టొచ్చని చూస్తున్నారు. హేట్ స్పీచ్ కిందకు ఏవి వస్తాయోననే దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు.
రాజద్రోహం కేసును ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ప్రత్యర్థులను బాధ్యులను చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ఎంతటి వారినైనా తమకు ఎదురు వస్తే ఊరుకునేది లేదనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజద్రోహం కేసుపై కూడా బిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు 124ఏ సెక్షన్ పై స్పష్టత ఇస్తూ దాని అమలుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.