Festivals: ఆంధ్రప్రదేశ్ లో పండుగల విషయంలో ప్రతిసారి వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో సీఎం జగన్ వైఖరిపై విమర్శలు వస్తున్నాయి. గత లాక్ డౌన్ సమయంలో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. జగన్ తీరును ఎండగట్టాయి. హిందువుల పండుగలపై ఎందుకంత నిర్లక్ష్యం అని నిలదీశాయి. దీంతో వైసీపీ ప్రభుత్వం అప్రదిష్ట మూటగట్టుకుంది. హిందూ వ్యతిరేకిగా జగన్ ను చిత్రీకరించారు. దీంతో ప్రభుత్వం వివరణ ఇచ్చినా వినిపించుకోలేదు.
వచ్చే సంవత్సరం ప్రథమార్థంల నిర్వహించే సంక్రాంతి, ఉగాది పండుగలపై ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశాలు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ర్టంలో ఘనంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి మొదటిది. ఆ తరువాతే ఏదైనా. దీంతో ప్రభుత్వం సంక్రాంతి విషయంలో ఎలాంటి ఉత్తర్వులు వెలువరించకుండా సజావుగా గడుపుకునేలా చూడాల్సిందేనని పలు పార్టీలు కోరుతున్నాయి.
దీంతో జగన్ సర్కారు కావాలనే హిందువుల పండుగలపై నిషేధం విధిస్తూ తన అక్కసు వెళ్లగక్కుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో సంక్రాంతి పండుగ నిర్వహణలో ఎలాంటి ఆక్షేపణలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెబుతున్నారు. కరోనా వేరియంట్ ఉందని సాకుగా చూపి ప్రజలను రెచ్చగొడితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: Sentiment politics: రాజకీయాల్లో ‘సానుభూతి’కి కాలం చెల్లిందా?
పండుగల సమయంలో పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని సూచిస్తున్నారు. తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు కంటే తమ పండుగలు పెద్దవి కావని చెబుతున్నారు. అందుకే ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరించి ఘనంగా జరుపుకునేందుకు సహకరించాల్సిందేనని చెబుతున్నారు.
Also Read: Nara Bhuvaneswari: టీడీపీని గాడిలో పెట్టే పనిలో భువనేశ్వరి.. పార్టీ ఆలోచన ఇదేనా?