Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సడెన్ ప్లాన్ ఛేంజ్.. ఏపీలో అధికారమే లక్ష్యంగా ఆ వ్యూహం

Pawan Kalyan: జనసేనాని రూటు మార్చారు. ఇక ప్రజాసేవనే ప్రథమ కర్తవ్యంగా ఎంచుకున్నారు. ఇన్నాళ్లు చేతిలో ఉన్న నాలుగైదు సినిమాలను పూర్తి చేసి దసరా తర్వాత రాజకీయ యాత్ర చేపట్టాలని భావించారు. కానీ ఇప్పుడు వచ్చిన అనుకోని అవాంతరాలతో అది సాధ్యం అయ్యే పని కాదని తేలింది. అందుకే ప్లాన్ బి అమలు చేస్తున్నారు.. సినిమాలు లేవు.. గినిమాలు లేవు.. ప్రజాక్షేత్రంలోనే నేరుగా తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. దసరాలోపు వీలైనన్ని పూర్తి చేసే ప్రజల్లోకి వెళ్లేందుకే డిసైడ్ […]

Written By: NARESH, Updated On : August 15, 2022 10:49 am
Follow us on

Pawan Kalyan: జనసేనాని రూటు మార్చారు. ఇక ప్రజాసేవనే ప్రథమ కర్తవ్యంగా ఎంచుకున్నారు. ఇన్నాళ్లు చేతిలో ఉన్న నాలుగైదు సినిమాలను పూర్తి చేసి దసరా తర్వాత రాజకీయ యాత్ర చేపట్టాలని భావించారు. కానీ ఇప్పుడు వచ్చిన అనుకోని అవాంతరాలతో అది సాధ్యం అయ్యే పని కాదని తేలింది. అందుకే ప్లాన్ బి అమలు చేస్తున్నారు.. సినిమాలు లేవు.. గినిమాలు లేవు.. ప్రజాక్షేత్రంలోనే నేరుగా తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. దసరాలోపు వీలైనన్ని పూర్తి చేసే ప్రజల్లోకి వెళ్లేందుకే డిసైడ్ అయ్యారు.

ఏపీలో అయితే ముందస్తు ఎన్నికలు.. లేదంటే రెగ్యులర్ గా ఎన్నికలు జరగవచ్చు. ఈ రెండింటికి కూడా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఎన్నికలకు ఆరునెలలు ముందు పార్టీ టికెట్లు, సంసిద్ధం గొడవలు ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నది కేవలం 6 నెలలు మాత్రమే. ఈ 6 నెలల్లోనే ఏపీ వ్యాప్తంగా యాత్ర చేపట్టాలి. ప్రజలకు చేరువ అయ్యి ఈసారి మెజార్టీ సీట్లు సాధించి అధికారంలోకి రావాలి. ఈ టార్గెట్ తోనే ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలతో రెడీ అయ్యారు. అందుకే దసరా నుంచే యాత్ర చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా పర్యటించాలనుకుంటున్నారు. దీని తేదీని కూడా తాజాగా నాదెండ్ల ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు. ఇప్పటివరకూ కౌలు రైతు భరోసా, జనవాణి పేరుతో ప్రజల్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్..సడెన్ గా వైరల్ ఫీవర్ రావడంతో అనారోగ్యం పాలయ్యారు. అందుకే గత మూడు నాలుగు వారాలుగా విశ్రాంతి తీసుకున్నారు. దీంతో జనసేన యాక్టివ్ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోలుకోవడంతో జనవాణి, కౌలు రైతు భరోసా యాత్రను కొనసాగిస్తూనే ఈ ఏపీ వ్యాప్తంగా రాజకీయ యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దసరా పండుగ పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లడానికి రెడీ అయ్యారు.

ఇక పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలున్నాయి. దసరాలోపు వీటన్నింటిని పూర్తి చేసి తర్వాత ఎన్నికల కార్యక్షేత్రంలోని దిగుదామని పవన్ కళ్యాణ్ అన్ని ప్లాన్లు చేసుకున్నారు. మిగిలిన సినిమాలను ఎన్నికల తర్వాత పూర్తి చేయాలని భావిస్తున్నారు. దాదాపు మెజార్టీ సినిమాలను పూర్తి చేయాలని భావించినా.. సడెన్ గా పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడడంతో దాదాపు నెలరోజుల సమయం వృథాగా పోయింది. దీంతో సినిమాలపై కోట్లు పెట్టిన నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారంతా ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ఏర్పాట్లన్నీ నాదెండ్ల చూసుకుంటున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా రెడీ అయినట్టు తెలిసింది. ఏపీలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా.. జనసేనకు విజయావకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ యాత్రను డిజైన్ చేసినట్టు తెలిసింది.

ఇక ఈసారి ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలను వదిలేసి..చిరంజీవిని గెలిపించిన సినీ అభిమానులు ఎక్కువగా ఉన్న తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అందుకే యాత్రను అవసరం అయితే తిరుపతిలోనే.. తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం మొదలుపెట్టడానికి రెడీ అయినట్లు తెలిసింది.

ఇక యాత్రలో తమపై విమర్శలు చేస్తున్న వారిని చీల్చిచెండాడేలా పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఉంటాయని.. జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చినట్టే ఈ యాత్ర తర్వాత పవన్ కళ్యాణ్ ను ప్రజలు గెలిపించేలా వ్యూహాత్మక ప్రచారం చేస్తారని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ యాత్ర ఏమేరకు సఫలీకృతం అవుతుంది? ఆయన రాజ్యాధికారం కల సాధ్యమవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.