Pawan Kalyan- Visakhapatnam: వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాజకీయం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ సర్కార్‌కు కొరకరాని కొయ్యలా మారారు. జనసేనాని లేవనెత్తుతున్న ప్రజా సమస్యలకు మంత్రలు సమాధానం చెప్పుకోలేక సాకులు వెతుక్కుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పవన్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా కట్టడి చేస్తోంది. ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అయితే.. ఏపీ సర్కార్ పవన్‌ను హోటల్‌లో నిర్భందించింది. బయట అడుగు పెట్టకుండా.. రెండు రోజులు హోటల్‌లోనే ఉంచి.. అక్కడి నుంచే తిరిగి మంగళగిరికి పంపించింది. సుమారు 500 మంది పోలీసులతో నిర్బంధకాండ సాగించింది.

ఇప్పటంలోనే అదే పరిస్థితి..
మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో ఏపీ ప్రభుత్వం రోడ్ల విస్తరణపేరుతో ఇళ్ల కూల్చివేత చేపట్టింది. ఈక్రమంలో బాధితులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో బాధితును పరామర్శించేందుకు జనసేనాని పవన్ ఇప్పటం వెళ్లారు. అక్కడ కూడా ఆయనను కట్టడి చేసేందుకు పోలీసులను ప్రయోగించింది ఏపీ ప్రభుత్వం. అయినా పవన్ నడుచుకుంటూ వెళ్లి బాధితులను కలిశారు. ఇళ్ల కూల్చివేతపై జగన్ సర్కార్‌ను కడిగి పాడేశారు. కేవలం జనసేన పార్టీ మీటింగ్‌కు స్థలం ఇచ్చారన్న సాకుతోనే ఇప్పటంలో వైసీపీ సర్కార్ కూల్చివేతలు చేపట్టిందని ఆరోపించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇళ్లు కూల్చివేసిన బాధితులకు రూ.లక్ష చొప్పున సాయానికి కూడా ముందుకు వచ్చారు. దీనిని అడ్డుకునేందుకు వైసీపీ సర్కాన్, స్థానికులతో తమ ఇళ్లు ఎవరూ కూల్చలేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది.

విశాఖలో పవన్‌కు నిరాజనం..
తాజాగా పవన్ విశాఖ రానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీంతో ఆయన రాకకోసం విశాఖ వాసులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామం వైసీపీ సర్కార్‌కు మింగుడు పడడం లేదు. ప్రధాని సభలో సీఎం జగన్, ఆయన మంత్రులు, కేంద్ర మంత్రులతోపాటు పవన వేదిక పంచుకోనున్నారు. దీంతో జగన్.. ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో.. ఆయన తమతో సమానంగా వేదికపై కూర్చోవడం గమనార్హం. మరోవైపు విశాఖ వాసులు.. పవన్‌కు జేజేలు పలుకుతుండడం… ఏపీ సర్కార్‌కు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం మంత్రులు, వైసీపీ నేతలు కిక్కురుమనకుండా ఉంటున్నారు.