Bheemla Nayak Vs Jagan : ‘భీమ్లానాయక్’ దెబ్బ వైసీపీ ప్రభుత్వానికి కాస్త గట్టిగానే తగిలినట్టుంది. ‘భీమ్లానాయక్’ను తొక్కేశామని వైసీపీ ప్రభుత్వం సంబరపడిందట.. కానీ అదే భీమ్లానాయక్ ను వైసీపీ వ్యతిరేక వర్గాలు అంతా కలిసి ఓన్ చేసుకొని హిట్ కొట్టించిన వైనం చూసి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోందట. ఏపీలో సమ్మె చేసిన ఉద్యోగులు, అమరావతి రైతులు, మత్స్యకారులు, అన్ని రాజకీయ పార్టీలు, ఇతర వైసీపీ వ్యతిరేక వర్గాలంతా ‘భీమ్లానాయక్’కు సపోర్టుగా నిలవడంతో ఆ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. పైగా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభుత్వానికి కక్కలేక మింగలేని పరిస్థితి ఏర్పడింది.
‘చలో విజయవాడ’ను ఉద్యోగులు ఎలా అయితే విజయవంతం చేశారో.. ఇప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వర్గాలన్నీ ‘భీమ్లానాయక్’ మూవీ కోసం ఒక్కటయ్యారు. తెలంగాణలో 250 టికెట్ ఉంటే.. ఏపీలో భీమ్లానాయక్ కు ఆ ధర లేకపోవడంతో నష్టపోకుండా ఉండేందుకు ఉద్యోగ, ప్రభుత్వ వ్యతిరేక వర్గాలన్నీ మూడు సార్లు చొప్పున సినిమా చూడాలని టికెట్లు కొని పంపిణీ చేశారట.. ప్రభుత్వం ఎంతగా అణచాలని చూస్తుంటే అంతలా ఈ సినిమాను పైకి లేపాలని వైసీపీ వ్యతిరేకులు, పవన్ ఫ్యాన్స్ ఈ పంతం పట్టినట్టు తెలిసింది.
‘భీమ్లానాయక్’ సినిమా కోసం అన్ని వర్గాలు పట్టుదల ప్రదర్శించాయి. ఎంతగా జగన్ సర్కార్ తొక్కేసిందో అంతకంటే మించి కలెక్షన్లు ఇప్పించాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వానికి నిరసనగా ఈ భీమ్లానాయక్ సినిమా చూడాలని నిర్ణయించారట.. ఆఖరుకు మంత్రి కొడాలి నాని ఇలాఖ గుడివాడలో కూడా భీమ్లానాయక్ బాగా ఆడింది. అక్కడి థియేటర్ ఓపెనింగ్ కు వచ్చిన కొడాలి నాని, పేర్ని నానిని పవన్ అభిమానులు అడ్డుకోవడం సంచలనమైంది.
కొడాలి నాని, పేర్ని నానిలకు వ్యతిరేకంగా నిరసనలో కాపులు, బలిజ, ఇతర సామాజికవర్గాల వారు సైతం మద్దతుగా నిలిచి ప్రోత్సహించినట్టు టాక్ ఉంది. దీంతో భీమ్లానాయక్ మూవీ ఏపీలోని కాపులు, ఇతర సామాజికవర్గాలను సైతం ఏకం చేసినట్టుగా కనిపిస్తోంది.
ఇక అమెరికాలో కూడా ‘భీమ్లానాయక్’ ప్రభంజనం సృష్టించింది. అక్కడి ప్రవాసభారతీయులు కూడా పవన్ కళ్యాణ్ సినిమాకు బ్రహ్మరథం పెట్టారు. తెలుగు వారిలా పవన్ లాంటి చొక్కాలు, ఎర్ర కండువాలు వేసుకొని వచ్చి హల్ చల్ చేశారట.. గతంలో ఏ సినిమాకు ఇంతగా ప్రవాసులు ఊగిపోవడం చూడని అక్కడి అమెరికన్లు సైతం భీమ్లానాయక్ మేనియాకు షాక్ కు గురయ్యారట..
మరోవైపు ఏపీలో థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లపై ఆంక్షలు పెట్టినా పవన్ సినిమా చూసేందుకు ఏపీ ప్రజలు వెనక్కి తగ్గలేదు. ఏకంగా పక్కనున్న తెలంగాణకు పోటెత్తారు. చాలా మంది ఏపీలో ఆంక్షలతో తెలంగాణలో సినిమా చూసేందుకు వచ్చారు. ఏపీలో ఎంతగా తొక్కేద్దామనుకుంటే సినిమాకు అంతగా ఆదరణ లభించింది. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. గతంలో ఎన్టీఆర్ ఏపీలో మద్యనిషేధం అమలు చేస్తే పక్కరాష్ట్రాలకు పోటెత్తినట్టే ఇప్పుడు ‘భీమ్లానాయక్’ కోసం తెలంగాణకు వచ్చి చాలా మంది సినిమా చూసివెళ్లారు.
ఏపీ సీఎం జగన్ చేస్తున్న పనులకు నిరసనగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన ‘ఆత్మాభిమానానికి, అహంకారానికి’ మధ్య పోరును ఏపీ ప్రజలు నిరూపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్న ఎన్టీఆర్ నేర్పించిన దాన్ని ప్రేక్షకులు అమలు చేశారు. జగన్ సర్కార్ రంగంలోకి దింపి.. భీమ్లానాయక్ థియేటర్లపై ఎంతగా నిఘా పెట్టినా సరే.. టికెట్లు రేట్లు పెంచకుండా ఆంక్షలు అమలు చేసినా ప్రేక్షకులు వెనక్కి తగ్గలేదు.
‘చలో విజయవాడ’ను పోలీస్ శాఖ ఎలా అయితే సహకరించి విజయవంతం చేశారో.. ఏపీ అధికారులు కూడా ‘భీమ్లానాయక్’ మూవీని విజయవంతం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ రెవెన్యూ శాఖ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతోనే ఏపీలో ‘భీమ్లానాయక్’ మూవీ ఘనవిజయం సాధించి రికార్డు కలెక్షన్లు వచ్చాయని సమాచారం. అంతేకాదు.. జగన్ ను వ్యతిరేకించే టీడీపీ, సీపీఐ, బీజేపీ , కాంగ్రెస్ నేతలు సైతం తమ అనుయాయులు, కుటుంబ సభ్యులతో ఈ సినిమాను చూసి విజయవంతం దగ్గరుండి చేయించారట..
ఇలా భీమ్లానాయక్ సినిమాను జగన్ సర్కార్ ఎంతగా తొక్కేద్దామనుకున్నా.. ప్రభుత్వ పెద్దల ఆంక్షలు అమలు కాలేదు. అందరూ పట్టుదలగా సినిమాను చూసి కలెక్షన్లు ఇప్పించి జగన్ సర్కార్ కు షాకిచ్చారు. పంతాలకు పోతే .. ప్రజలతో పెట్టుకుంటే.. వారు ఓన్ చేసుకుంటే ఎలా అవుతుందో భీమ్లానాయక్ మూవీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ ఒంటరి కాదని.. ఏపీ ప్రజలు, నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు ఓన్ చేసుకున్న తీరు అద్భుతమేనే చెప్పాలి.
మడమ తిప్పకుండా.. వెనక్కి తగ్గకుండా జగన్ ను ఎంతగా పవన్ కళ్యాణ్ ఎదురించాడో అందరికీ తెలిసిందే.. తన సినిమా ఆడకున్నా కలెక్షన్లు తగ్గినా కూడా ఏపీ సమస్యలపై తగ్గేదేలే అన్నట్టుగా పవన్ నిలబడ్డారు. దానికి జగన్ సర్కార్ పంతం పట్టి ‘భీమ్లానాయక్’ మూవీ విషయంలో ఆంక్షలు పెట్టినా ఏపీ ప్రజలు, నేతలు అన్ని వర్గాలు చూపించిన ఈ ఆదరణ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకు మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భీమ్లానాయక్ దెబ్బకు ‘జగన్’ ను ఎదురించిన ఏకైక మొనగాడు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఒక్కడేనన్న చర్చ సాగుతోంది.
Also Read: Clash Over Bheemla Nayak Movie Tickets: ప్చ్.. సినిమా టికెట్ల కోసం గొంతు కోయడం ఏమిటయ్యా ?
Recommended Video: