Prathi Vyuham: బయోపిక్ లు తీయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందివేసిన చేయి. చాలా క్రియేటివ్ గా పొలిటికల్ బయోపిక్ లు తీయగలరు. ప్రస్తుతం ఆయన ‘వ్యూహం’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. వచ్చే ఎన్నికలకు ముందే ఆ సినిమాను తెరమీదకు తీసుకురానున్నారు. జగన్కు అనుకూలంగా.. విపక్షాలకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే టీజర్లు ఉన్నాయి.
రామ్ గోపాల్ వర్మ ఇటీవల వివాదాస్పద దర్శకుడుగా మారాడు. పవన్ కళ్యాణ్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసైనికుల నుంచి హెచ్చరికలు వస్తున్న పెడచెవిన పెడుతున్నారు. తన పంధా మార్చుకోవడం లేదు.అయితే తాజాగా తాను తీస్తున్న వ్యూహం సినిమాలో.. పవన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి పాత్రను చూపిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు పవన్ పెద్దగా యాక్టివ్ గా లేరు. అయినా సరే ఆయన పాత్రను ప్రతికూలంగా చూపిస్తున్నారు. మధ్యలో మెగాస్టార్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. దీనిని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక సినిమాలు కొత్త కాదు. దివంగత ఎన్టీఆర్ నుంచే ప్రతికూల సినిమాలను ఆ పార్టీ లైట్ తీసుకుంది. సినిమా రంగంపై మంచి పట్టున్నా ఏనాడు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. గత ఎన్నికల ముందు కథానాయకుడు రూపంలో ఎన్టీఆర్ బయోపిక్ చేసినా.. ఎవ్వరిని వ్యతిరేకంగా చూపించలేదు. గత ఎన్నికల ముందు నుంచే ఆర్జీవి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును టార్గెట్ చేసుకున్నా టిడిపి శ్రేణులు లైట్ తీసుకున్నాయి. దానికి దీటుగా ఎటువంటి సినిమాలు తేవాలన్న ప్రయత్నం చేయలేదు. అయితే జనసేన మాత్రం ఆర్జీవిని తిప్పి కొట్టాలని భావిస్తోంది.
వ్యూహానికి దీటుగా ‘ప్రతి వ్యూహం’ సినిమాను తెరపైకి తేవాలన్న యోచనలో జనసేన పార్టీ ఉన్నట్లు సమాచారం. కేవలం 15 రోజుల్లోసినిమాను పూర్తి చేయాలన్న కసితో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ సంబంధమూ లేని పవన్ ను వ్యూహం సినిమాలో ప్రతికూల పాత్రలో చూపించేసరికి జన సైనికులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వ్యూహం సినిమా వచ్చిన తర్వాత.. ప్రతి వ్యూహం సినిమాను విడుదల చేయడమా? అంతకంటే ముందే రిలీజ్ చేయడమా? అని జన సైనికులు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ కు ప్రతి వ్యూహం సినిమా ద్వారా గట్టిగా కొట్టాలన్న యోచన లో పవన్ ఉన్నట్టు సమాచారం. ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేసేలా ప్రతి వ్యూహం సినిమాను తెరపైకి తేవడానికి బలంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి.