NBK X PSPK Part 1 PROMO : అభిమానులు.. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే డేట్ దగ్గర పడింది..ఈ ఎపిసోడ్ ని గత ఏడాది డిసెంబర్ 27వ తారీఖున షూట్ చేసారు.. కానీ విడుదల ఎప్పుడో చెప్పకుండా అభిమానులను ఊరిస్తూ వచ్చారు..మొత్తానికి ఇటీవలే ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ వీడియో ని మరియు చిన్న టీజర్ ని విడుదల చేసారు..అందులో పెద్దగా మ్యాటర్ లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు..దీనితో ఈరోజు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మెయిన్ ప్రోమో ని విడుదల చేశారు..
బాలయ్య ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ చేసిన సందడి ప్రోమో అదిరిపోయింది.. పవన్ కళ్యాణ్ ని బాలయ్య అడిగిన ఆసక్తి ప్రశ్నలు..దానికి పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానాలు అభిమానులను ఆకట్టుకున్నాయి..ప్రోమో నే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఫుల్ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు..ఈ ప్రోమో లో మెయిన్ హైలైట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పవన్ కళ్యాణ్ రాగానే బాలయ్య బాబు బండ్ల గణేష్ పాపులర్ డైలాగ్ ‘ఈశ్వరా పవనేశ్వర..పవనేశ్వర’ అంటూ బాలయ్య ఇంట్రడక్షన్ ఇస్తాడు ఆ తర్వాత..ముందుగా మనం మొదటిసారి ఎక్కడ కలుసుకున్నామో గుర్తు ఉందా అని బాలయ్య బాబు – పవన్ కళ్యాణ్ గతంలో కలుసుకున్న ఫోటోని స్క్రీన్ మీద వేస్తారు..అప్పుడు బాలయ్య ఇందులో నేను చాలా యంగ్ గా కనిపిస్తున్నాను కదా అని అంటాడు..అప్పుడు పవన్ కళ్యాణ్ మీరు ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తున్నారు అని అంటాడు.. అప్పుడు బాలయ్య కన్నుకొడుతూ ఆడియన్స్ వైపు చూస్తాడు..
ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇస్తాడు…రాగానే బాలయ్య ఒక్కసారి తొడగొట్టు అంటాడు..అప్పుడు సాయి ధరమ్ తేజ్ నేరుగా బాలయ్య వద్దకి వచ్చి ఆయన తొడ గొట్టబోతాడు.. ఆ తర్వాత అమ్మాయిలుకు దూరంగా ఉండాలంటూ తనకు పెళ్లి , పెళ్లిచూపులు వద్దంటూ బాలయ్యను సాయిధరమ్ వేడుకుంటాడు.
ఇక నీకు అమ్మ అంటే భయమా? మీ భార్య అంటే భయమా? అని బాలయ్య నేరుగా పవన్ ను అడుగుతాడు. దానికి పవన్ ఏం సమాధానం చెప్తాడన్నది ఆసక్తి రేపింది. మధ్యలో బాలయ్య.. భార్య అని చెప్పయ్యా అంటూ చలోక్తి విసురుతాడు.
ఇక అన్నింటికి ముఖ్యమైంది ఎంతో అభద్రతభావానికి గురయ్యే.. మౌనముని పవన్ పవర్ స్టార్ ఎలా అయ్యాడని బాలయ్య ప్రశ్నిస్తాడు. దానికి పవన్ సమాధానం విని అంతా షాక్ అయ్యారు. తాను డిప్రెషన్ లోకి వెళ్లి ఒకనాడు అన్నయ్య చిరంజీవి రూమ్ లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకోబోయాను అంటూ పవన్ సంచలన నిజాన్ని లీక్ చేశాడు. అసలేం జరిగిందన్నది ఫిబ్రవరి 3న ఆహాలో ప్రసారమయ్యే ప్రీమియర్ ఎపిసోడ్ లోనే చూడాలి. ఇలా ఆద్యంతం ఫన్ తో ఈ ప్రోమో నడుస్తుంది.
ఆ ప్రోమోను కింద చూడొచ్చు..