Janasena Veeramahila : వచ్చే ఏడాదిలో ఎన్నికలు రానుండటంతో పార్టీల్లో కదలికలు వస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే వైసీపీని ఎదుర్కొని నిలవాలని జనసేన ఆశిస్తోంది. దీనికి గాను పలు మార్గాలు అన్వేషిస్తోంది. అనుబంధ రంగాలను ఏర్పాటు చేసి వారి ద్వారా పార్టీ ప్రచారం ముమ్మరం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో జయంతి నిర్వహించి మహిళా విభాగాన్ని ప్రకటించింది.
జనసేన పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. రాష్ర్టంలో పాగా వేసేందుకు పవన్ కల్యాణ్ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయమంటే ఎదుటి వారిని బూతులు తిట్టడం కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. విమర్శలు చేయడంలో ఎప్పుడు కూడా హద్దులు దాటొద్దని చెబుతున్నారు. వైసీపీ నేతల ఆగడాలకు త్వరలో అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీకి మహిళలు అండగా నిలవాలి. మహిళలు రాజకీయాల్లోకి రావాలి. పురుషులతో సమానంగా పదవులు అలంకరించాలి. అందుకు వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే వారు రాజకీయాల్లో చేరి తమ ప్రభావం చూపించగలరు. వారిని గౌరవిస్తూ వారికి ఉన్నతమైన పదవులు ఇస్తే తప్పకుండా వారు రాణించే అవకాశం ఉంటుంది. వారికి ఎల్లవేళలా తోడుంటూ వెన్నంటి నిలవాలి. నాయకులంటే నోటికొచ్చినట్లు మాట్లాడం కాదని చెప్పారు. రాజకీయాల్లో పోరాటం చేయగల సత్తా ఉన్న మహిళలు రావాలని ఆకాంక్షించారు.
వీర మహిళలే పార్టీకి అండ. వారితోనే జనసేన పోరాటం చేస్తుంది. భవిష్యత్ లో అధికారం కూడా దక్కించుకుంటుంది. దీనికి మహిళా శక్తి అవసరం. ఝాన్సీ లక్ష్మీబాయి 149వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో జనసేన మహిళా విభాగానికి వీరమహిళా విభాగమని నామకరణం చేశారు. స్త్రీ శక్తి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ప్రకటించారు. దీంతో మహిళలు పార్టీలో చేరి అధికారం కోసం తమ సహకారం అందించాలని కోరారు. జనసేన పార్టీ మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.