Varahi Vijaya Yatra: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన పార్టీ శ్రేణులతో పాటుగా యావత్తు తెలుగు ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ‘వారాహి విజయయాత్ర’ వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని ద్వేషించే వారు కూడా ఈ యాత్ర ని తీక్షణంగా గమనిస్తున్నారు. అందరి హీరోల అభిమానులను కలుపుకొని పోతూ, ఆలోచింపచేసే ప్రసంగాలతో, ప్రభుత్వం చేస్తున్న తప్పులను , పొరపాట్లని ఎత్తి చూపిస్తూ పవన్ కళ్యాణ్ ఈ యాత్ర లో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నాడు.
కత్తిపూడి సభతో ప్రారంభమైన వారాహి విజయయాత్ర పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం , అమలాపురం మీదుగా నర్సాపురం మరియు భీమవరం వైపు కొనసాగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ నిన్న అమలాపురం లో ఇచ్చిన ప్రసంగం సోషల్ మీడియా లో సెన్సేషన్ సృష్టిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైసీపీ కోర్ వోట్ బ్యాంకు అయినా దళిత వర్గం ని ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలను బయటపెట్టాడు.
ఆయన మాట్లాడుతూ ‘మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి నేను దళితులకు మేనమామని అని అంటూ ఉంటాడు.దళితులకు మేనమామ అంటే మీరు అసలు నమ్మకండి దయచేసి, మేనమామ ఈరోజు ఉంటాడు రేపొద్దున వెళ్ళిపోతాడు, మేనమామతో సంబంధం లేదు, ఇది కుటుంబ బంధాలు కాదు, రాజ్య బంధం ఇది, రాజ్యాంగ పరిరక్షణ చెయ్యాలి. మేనమామ , బాబాయి, తాత ఈ బంధుత్వాలు ఎవరికీ కావాలయ్యా, మాకు కావాల్సింది అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాంగ పరమైన భద్రతని కలిగించు మాకు.నిజంగా మీకు దళితుల మీద అంత ప్రేమనే ఉంటే, 23 దళిత పధకాలను ఎందుకు రద్దు చేసారు. అంబేద్కర్ విదేశీ విద్యా మీరెందుకు తీసేసారు, ఈరోజు నేను అంబేద్కర్ కోనసీమ నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాము, ఎందుకు మీరు అంబేద్కర్ విదేశీ విద్యా పధకం పేరు తీసేసి, జగన్ విదేశీ విద్యా అని ఎందుకు పేరు పెట్టారు. అంబేద్కర్ కంటే నువ్వు గొప్పవాడివి జగన్ మోహన్ రెడ్డి’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.