Homeజాతీయ వార్తలుPawan Kalyan : ఈ ఎన్నికలకి పవన్ కళ్యాణ్ సిద్దంగా లేడా?

Pawan Kalyan : ఈ ఎన్నికలకి పవన్ కళ్యాణ్ సిద్దంగా లేడా?

Pawan Kalyan : జనసేనాని పవన్ అసలు ఉద్దేశ్యమేమిటి? ఇప్పుడు తెలుగునాట ఇదే ప్రధాన చర్చగా మారింది. సరిగ్గా కర్నాటక ఫలితాలు వస్తున్న వేళ, జేడీఎస్ కీరోల్ పోషిస్తుందని అంచనాల వేళ, ఏపీలో కూడా జనసేన కూడా అదే పాత్రను పోషిస్తుందని భావిస్తున్న వేళ, పవన్ విరుద్ధ ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే లోతైన అధ్యయనం చేసిన తరువాతే పవన్ ఇటువంటి ప్రకటన చేసి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. ఎన్నోవిధాలుగా ఆలోచించి మాట్లాడి ఉంటారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వైసీపీని పవర్ లో నుంచి దించి ప్రజలకు ఇస్తానన్న వ్యాఖ్యలు వెనుక చాలారకాలుగా ఈక్వేషన్లు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వేర్వేరు విశ్లేషణలు..
అయితే దీనిని రాజకీయ ప్రత్యర్థులు ఇంకోలా విశ్లేషిస్తున్నారు. పవన్ ది రాజకీయ అజ్ఞానంగా ప్రారం మొదలుపెట్టారు. అదే సమయంలో పవన్ వ్యాఖ్యలతో జనసైనికులు కూడా తెగ బాధపడుతున్నారు. అంతర్మథనం చెందుతున్నారు. తాము ఎంతో ఊహిస్తే తమను నిరాశపరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత‌కాలం నాగ‌బాబు త‌దిత‌ర జ‌న‌సేన నాయ‌కులు జ‌న‌సేన ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అని చెబుతున్న‌వ‌న్నీ ఉత్తుత్తివే అని ఇవాళ్టితో తేలిపోయిందని వాపోతున్నారు. పవన్ పొత్తుల వరకూ క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదని.. కానీ సీఎం పదవిపై విస్పష్ట ప్రకటనను ఎక్కువ మంది తప్పుపడుతున్నారు.

వాస్తవికతకు దగ్గరగా..
పవన్ వాస్తవికతను దగ్గరగా ఉండేలా మాట్లాడారన్న వారూ ఉన్నారు. ఆయన మాటలు సైతం అలానే ఉన్నాయి. కచ్చితంగా పొత్తు పెట్టుకుంటాం. కొంద‌రిని ఒప్పిస్తాం. సీఎం సీటు ఇస్తే త‌ప్ప పొత్తుకు ఒప్పుకోవ‌ద్ద‌ని సూచించే వాళ్లున్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 137 సీట్ల‌లో అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డ‌మే గొప్పు. 137 సీట్ల‌లో  క‌నీసం 30 నుంచి 40 సీట్ల‌లో గెలిచి వుంటే, సీఎం సీటు డిమాండ్ చేయాల‌నే వాద‌న‌కు బ‌లం వుండేది. అప్పుడు క‌ర్నాట‌క‌లో జేడీఎస్ నేత కుమార‌స్వామి గౌడ్‌లాగా నాకు అవ‌కాశాలుండేవి. భాగ‌స్వామ్య పార్టీని ముఖ్య‌మంత్రి ప‌ద‌విని డిమాండ్ చేయాలంటే క‌నీసం 30 లేదా 40 ఎమ్మెల్యే సీట్లు చేతిలో వుండాలి కదా అని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో పవన్ తనను తాను తగ్గించుకున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో పవన్ పోటీచేసిన రెండుచోట్ల ఓడిపోయారు. 137 స్థానాల్లో పోటీచేస్తే ఒకచోటే గెలుపొందారు. అయితే ఇంతలా ఓటమి ఎదురైతే ప్రజలను నిష్టూరమాడి రాజకీయాల నుంచి విశ్రమిస్తారు. కానీ పవన్ అలా చేయలేదు. కలబడ్డారు.. నిలబడ్డారు.. జనసేనను నిలబెట్టుకోగలిగారు.

2029 టార్గెట్
అయితే పవన్ మనోగతం..అభిమానించేవారికి ఒకలా.. విభేదించే వారికి మరోలా కనిపిస్తోంది. అయితే సహజం కూడా. కానీ అభిమానించే వారికి అంతుపట్టని చాలా విషయాలు ఉన్నాయి. అసలు వచ్చే ఎన్నికలకు పవన్ సిద్ధంగా ఉన్నాడా? లేడా? అన్న సంశయం ఉంది. అయితే పవన్ తన చర్యల ద్వారా మిశ్రమ సమాధానమే ఇస్తున్నారు. ఎన్నికలకు పట్టుమని ఏడాది లేదు. ఇప్పటివరకూ పవన్ పూర్తిస్థాయిలో రాజకీయాలు చేయడం లేదు. ఇంకా సినిమాలు చేస్తున్నారు. అవి పూర్తయ్యేసరికి మరో ఆరు నెలలు పడుతుంది. పార్టీకి వైభవం తీసుకొచ్చేదిగా భావిస్తున్న వారాహి యాత్ర కూడా ప్రారంభం కాలేదు. ఇప్పుడు పవన్ తాజా ప్రకటన చూస్తే 2024 ఎన్నికల్లో పార్టీకి మెట్లు కట్టి.. 2029 ఎన్నికల్లో అధికారం అందుకోవాలని చూస్తున్నట్టుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular