Pawan Kalyan- Nagababu: గత అనుభవాల నుంచి జనసేన గుణపాఠాలు నేర్చుకున్నట్టుంది. అందుకే గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. 2024 ఎన్నికలకు ముందస్తుగానే కసరత్తు ప్రారంభించింది. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకూ జనసేనాని పవన్ ఒక్కరే అన్నీతానై వ్యవహరిస్తున్నారు. నాదేండ్ల మనోహర్ ఇతోధికంగా సాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పడు మెగా బ్రదర్ నాగబాబు ఒక చేయి వేశారు. అందుకే పార్టీ కార్యక్రమాలు విస్త్రతమవుతున్నాయి. పార్టీ వ్యూహాలను పదును పెట్టే పనిలో పవన్ కళ్యాణ్ ఉండగా.. మెగా బ్రదర్ నాగబాబు జిల్లాలను చుట్టేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకుంటానని రాజకీయంగా కొత్త చర్చకు కారణమైన పవన్ ఇప్పుడు అదే పనిపై పడ్డారు. నెల 4న జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు అంశాలపై చర్చించనున్నారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర అంశంపై మరింత లోతుగా చర్చించేందుకు నిర్ణయించారు.అమరావతి పరిధిలోని మంగళగిరి పార్టీ కార్యాలయాంలో సమావేశం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శ్రేణులతో మమేకం..
నాగబాబు అటు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం పర్యటన సక్సెస్ అయ్యింది. జనసేన శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. ఇక వైసీపీ టార్గెట్ గా నాగబాబు ప్రసంగాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో పొత్తుల పైన పార్టీ మూడ్ తెలుసుకొనేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన గురించి ఆయన తరచూ ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితులలో జనసేన లాంటి పార్టీ అధికారంలోకి రావలసిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేస్తున్నారు.
Also Read: Eight years of Telangana: ఎనిమిదేళ్లలో ఏం సాధించాం.. తెలంగాణ బంగారం అయిందా?
. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిస్తున్నారు. నియోజకవర్గాలలో జనసేన కార్యకర్తలు, నాయకులలొ ఏమైనా అభిప్రాయ బేధాలుంటే వాటిని పక్కకు పెట్టి పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, సమన్వయంతో పార్టీ కార్యకలాపాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పొత్తులపైన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు.
వైసీపీ టార్గెట్..
ఒకవైపు పొత్తులకు ప్రయత్నిస్తునే టీడీపీ జనసేన కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. వైసీపీని మాత్రమే లక్ష్యంగా చేసుకొని టీడీపీ రాజకీయ అడుగులు వేస్తోంది. జనసేన గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురావటం లేదు. అదే విధంగా టీడీపీ పైనా జనసేన ఎటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు. ఇప్పుడు బీజేపీతో ఉన్న బంధం పైనే జనసేన తేల్చుకోలేకపోతోందనే చర్చ సాగుతోంది.వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారే లక్ష్యంతో బీజేపీతో కొనసాగాలా లేదా అనే దాని పైన తర్జన భర్జన పడుతోంది. అయితే, అటు కేంద్రంలో బీజేపీ అధినాయకత్వం సీఎం జగన్ తో సన్నిహితంగా ఉండటం.. రాష్ట్రం లో తమతో మిత్రపక్షంగా ఉండటం పైన జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, వచ్చే ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ -జనసేన కలిసి పోటీ చేయాలనేది కొందరు జనసేన నేతల అభిప్రాయం. అయితే, అందుకు బీజేపీ సహకరిస్తుందా లేదా అనేది సందేహమే. ఈ పరిస్థితుల్లో పార్టీలో మెజార్టీ అభిప్రాయం మేరకు ముందుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 4న జరిగే పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయం పైన మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read:CM Jagan Delhi Tour: మళ్లీ ఢిల్లీకి జగన్.. అసలు కథేంటి?
Recommended Videos:
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Pawan kalyan in amravati nagababu in uttaranchal what is the real target
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com