Drugs Fight: రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఈ విషయం ఎవరికి తెలిసినా తెలియకపోయినా జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అఫ్ కోర్స్ మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సార్ కు ఈ విషయం ఎప్పుడూ తెలుసు. అందుకే ఆయన ముందుగానే సుదులాయించుకుటాండు. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు బై.. అసలు ఎక్కడ తగ్గాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిందేనంటారు. అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడానికైనా చంద్రబాబు వెనుకాడరని ఆయనను దగ్గరి నుంచి చూసినోళ్లు చెబుతుంటారు. అందుకే పోయిన చోటే ఏపీలో ఇప్పుడు ‘అధికారం’ వెతుక్కునే పనిలో పడ్డారట చంద్రబాబు, పవన్ లు..
ఏపీలోని రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఇప్పుడు ‘కలిసి సాగితే కలదు సుఖం’ అన్నట్టుగా ముందుకెళుతున్నట్టు పరిణామాలను బట్టి చూస్తే స్పష్టం అర్థమవుతోంది..రెండు ప్రధాన పార్టీలు ఒకే అంశం మీద రోజుల తరబడి మాట్లాడడం.. తాజాగా పోరుబాట పట్టడం చూస్తే టీడీపీ, జనసేన పకడ్బందీ వ్యూహంతో జనంలోకి వెళుతున్నారని స్పష్టమవుతోంది.
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రేపిన ‘డ్రగ్స్ మంటలు’ చల్లారడం లేదు. అవి టీడీపీపై దాడుల వరకూ సాగాయి. అనంతరం ఏపీ డ్రగ్స్ దందాపై జాతీయ స్థాయిలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులతో నానా యాగీ చేసి వచ్చారు.ఆయన అలా వచ్చారో లేదో పవన్ ఇలా మొదలుపెట్టేశారు.
నిన్నటిదాకా తెలుగుదేశం అజెండాగా ఉన్న ఏపీ డ్రగ్స్ వివాదం.. ఇప్పుడు పవన్ కూడా అందిపుచ్చుకున్నాడు.. అదేదో ముందుగానే చెప్పినట్టు.. పక్కా ప్రణాళికతోనే సాగుతున్నట్టు చంద్రబాబు ఎక్కడ ఆపాడో.. పవన్ అక్కడే మొదలు పెట్టడం వివేషం. ఏపీలో అక్రమ గంజాయి రవాణాను పవన్ ఈరోజు ఉదయం సాక్ష్యాలతో ఎలుగెత్తి చాటాడు.
దీన్ని బట్టి ఏపీ ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన కలిసి సాగుతున్నాయా? అన్న అనుమానాలు కలుగకమానదు. బద్వేలు ఉప ఎన్నికల్లో మరణించిన వైసీపీ ఎమ్మెల్యే భార్యకు సంఘీభావంగా జనసేన పోటీ నుంచి వైదొలిగింది. పవన్ పిలుపు మేరకు చంద్రబాబు అక్కడ పోటికి దింపలేదు. జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ మాత్రం పవన్ మాటను జవదాటి పోటీచేస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డ్రగ్స్ వివాదాన్ని రాజేస్తే జనసేనాని పవన్ దాన్ని అందిపుచ్చుకొని పోరుబాట పడుతున్నారు. ఈ రెండు పార్టీల తీరు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందనేది భవిష్యత్తులోనే చూడాలి.
Also Read: కలవని మోడీ షాలు.. చంద్రబాబుకు దారుణ అవమానం?