https://oktelugu.com/

పదో తరగతి పరీక్షలపై పవన్ వైఖరి ఇదే..!

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరానా ఉధృతి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం చిన్నారుల ఆరోగ్యం పణంగా పెట్టినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం కావడం తల్లిదండ్రులలో కలవరం కలిగిస్తోందన్నారు. జులై 10 వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కూడా ఖరారు చేశారని, పరీక్షా పేపర్లు కుదించినప్పటికీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 16, 2020 / 10:58 AM IST
    Follow us on


    పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరానా ఉధృతి రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం చిన్నారుల ఆరోగ్యం పణంగా పెట్టినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం సన్నద్ధం కావడం తల్లిదండ్రులలో కలవరం కలిగిస్తోందన్నారు. జులై 10 వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ కూడా ఖరారు చేశారని, పరీక్షా పేపర్లు కుదించినప్పటికీ కోవిడ్-19 రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంత మాత్రం మంచిది కాదన్నారు.

    ఆంధ్రప్రదేశ్ కి పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి కరోనని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర హైకోర్టు అంగీకరించలేదని చెప్పారు. పిల్లల ప్రాణాలను పణంగా పెట్టడానికి మేము ఎటువంటి పరిస్థితులలో అంగీకరించమని హైకోర్టు ఖరాకండిగా తెలిపిందన్నారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నల్ మార్కులు ఆధారంగా ఉత్తీర్ణతను ఖరారు చేసిందని చెప్పారు.

    రాష్ట్రంలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. 6 వేలకు పైగా కేసులు ఇప్పటికే నమోదయ్యాయని, పరీక్షా కేంద్రాలకు పిల్లలను తీసుకు వెళ్లడం చాలా ప్రమాదకరంగా కనబడుతోందన్నారు. ప్రైవేట్ వాహనాలు అందుబాటు కూడా చాల తక్కువగా వుంది. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ తరుణంలో తల్లిదండ్రుల కొరిక మేరకు చిన్నారుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, పొరుగు రాష్ట్రాలలో అనుసరించిన విధానాలను పాటించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు.