Pawan Kalyan Chaitanya Ratham: పవర్ స్టార్.. జనసేనాని పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు రథం సిద్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా చేపట్టే ఈ యాత్రలో ఆయన ప్రయాణించే బస్సునే కీలకం. నాడు ఎన్టీఆర్ ‘చైతన్య రథం’తో రాష్ట్రమంతా తిరిగి 9 నెలల్లోనే అధికారం సంపాదించాడు. ఆయన స్ఫూర్తిగా అచ్చం అలాంటి బస్సునే పవన్ తయారు చేయిస్తున్నాడు.

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే యాత్రకు సంబంధించిన ప్రత్యేక వాహనాన్ని తాజాగా బుధవారం పరిశీలించారు. సాంకేతిక నిపుణులతో చర్చించి సూచనలు చేశారు.

దసరా నుంచే ఈ యాత్రను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ ఇంకా ఏపీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడే కంటే ఎన్నికల ఏడాది చివరి సంవత్సరం పర్యటిస్తే అటు ప్రజల్లో ఊపు తీసుకురావచ్చు..పార్టీని బలోపేతం చేయవచ్చని బస్సుయాత్రను వాయిదా వేశారు.

ఇక పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కోసం ప్రత్యేకంగా శ్రద్ధతో ఓ బస్సును తయారు చేస్తున్నారు. దాదాపు 6 నెలల పాటు ఈ బస్సులోనే పవన్ కళ్యాణ్ బస చేస్తారు. ఆయన అవసరాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అందుకే పవన్ వెళ్లి పరిశీలించి మరీ దీనికి పలు సూచనలు చేశారు.