Parliament winter session 2021: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రెడీ అయ్యాయి. పంటలకు కనీస మద్దతు ధర, ధరల పెరుగుదల, నిరుద్యోగం, పెగసస్, ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వంపై పోరాడేందుకు సమాయత్తమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వ్యవసాయ చట్టాలతో కుదేలైపోయిన కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసినా ప్రతిపక్షాలు మాత్రం రైతుల పక్షాన పోరాడేందుకు అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాయి. సమావేశాల తొలి రోజు నుంచే ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఎంపీలందరు సభకు హాజరు కావాల్సిందేనని చెప్పింది. దీంతో అందరు విధిగా హాజరు కావాల్సిందే.
మరోవైపు ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రధాని మోడీ ఎందుకు సమావేశానికి రాలేదని ప్రశ్నిస్తోంది. దీనిపై బీజేపీ నేతలు కూడా సరైన విధంగానే స్పందిస్తున్నారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని హాజరు కావాలనే నిబంధన ఏదీ లేదని తేల్చిచెబుతున్నారు. దీంతో సభ నిర్వహణపై ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

కేంద్రం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని చూస్తున్నాయి. దీనికి ప్రభుత్వం సరైన విధంగా స్పందిస్తుందో లేదో చూడాల్సిందే. టీఎంసీ, కాంగ్రెస్, వైసీపీ, డీఎంకే తదితర పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని చెబుతున్నా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుందో లేదో తెలియడం లేదు.
Also Read: దశ మారుతుందా? కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ ఓకే
ప్రతిపక్షాల విమర్శలను కూడా సరైన రీతిలో తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ కూడా ఎంపీలకు సూచించింది. సభలో హుందాగా ఉంటూ సమస్యల పరిష్కారానికి సహకరించేలా అందరు సంసిద్ధంగా ఉంటేనే సభ సజావుగా సాగుతుందని తెలుస్తోంది. అంతేకాని ఎవరికి వారు తమకు ఇష్టమొచ్చిన విధంగా ప్రవర్తిస్తే చర్యలుంటాయని చెబుతున్నారు.
Also Read: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయడం ఇది ఎన్నో సారి ?