ఏపీలో ‘పంచాయితీ’ హీట్‌

ఏపీలో ఇప్పుడు లోకల్‌ ‘పంచాయితీ’ నడుస్తోంది. అటు ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ ప్రకటించడం.. నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయడం.. దానిని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టు దాక వెళ్లడం అందరికీ తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టులో సైతం ఎస్‌ఈసీకి అనుకూలంగా తీర్పునిస్తూ.. ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు అక్కడి రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. Also Read: బదిలీల గేమ్‌ స్టార్ట్‌ ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం […]

Written By: Srinivas, Updated On : January 26, 2021 3:21 pm
Follow us on


ఏపీలో ఇప్పుడు లోకల్‌ ‘పంచాయితీ’ నడుస్తోంది. అటు ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ ప్రకటించడం.. నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయడం.. దానిని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టు దాక వెళ్లడం అందరికీ తెలిసిందే. చివరకు సుప్రీం కోర్టులో సైతం ఎస్‌ఈసీకి అనుకూలంగా తీర్పునిస్తూ.. ఎన్నికలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు అక్కడి రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.

Also Read: బదిలీల గేమ్‌ స్టార్ట్‌

ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను తూ.చ. తప్పకుండా అమల్లో పెడుతున్నది. పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది కమిషనర్ గిరిజాశంకర్‌‌ను చాలా స్పీడుగా నిమ్మగడ్డ బదిలీ చేసేశారు. అలాగే ఇద్దరు జిల్లాల కలెక్టర్లను ఓ ఎస్పీని+డీఎస్పీతోపాటు నలుగురు ఇన్‌స్పెక్టర్లను సైతం ట్రాన్స్‌ఫర్‌‌ చేసేశారు.

ఇదిలా ఉంటే.. సుప్రీం కోర్టులో ప్రభుత్వ ఓటమిని చంద్రబాబునాయుడు పచ్చ బ్యాచ్ కాస్త తమ విజయంగా చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం పదవులను టీడీపీనే గెలుచుకోవలని చంద్రబాబు నుంచి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ వరకు ఒకటే హంగామా చేసేస్తున్నారు.

Also Read: తెలంగాణలో ‘వైసీపీ-షర్మిల’కు సాధ్యమేనా?

అయితే.. పంచాయతీ ఎన్నికలు అంటేనే పార్టీ రహితంగా జరుగుతుంటాయి. గెలిచిన వాళ్లు ఏ పార్టీకి చెందిన వాళ్లు అనే దాన్ని బట్టి ఏ పార్టీ ఖాతాలో ఎంతమంది సర్పంచులున్నారని అనుకోవాల్సిందే. అయితే.. లోకల్ బాడీ ఎన్నికలంటే సహజంగా అధికారపార్టీకి అనుకూలంగానే ఉంటాయనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి పార్టీ అఫిలియేషన్ అన్నది లేకపోయినా గెలిచిన వాళ్ళంతా అధికార పార్టీకే జై కొడతారనటంలో సందేహం లేదు.

చంద్రబాబు చెప్పేదేమిటంటే పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలట జనాలు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో జనాలకు నష్టం జరిగే పనులేవీ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. పైగా ఏదో ఓ సంక్షేమ పథకంలో వీలైనంత మందిని లబ్ధిదారులుండేట్లుగా చూసుకుంటున్నారు జగన్. కాబట్టి జనాల్లో ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత ఉండే అవకాశాలు తక్కువే. ఇంకా చంద్రబాబుపైనే జనాలకు మంటగా ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్