India vs Bangladesh : అంతర్జాతీయంగా భారత్ దౌత్య విధానాలతో ప్రపంచం యావత్తు ఇండియా వెనకే ఉంటుంది. అదే విధంగా శత్రుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లు భారత్ వ్యూహాలతో వణుకుతున్నాయి. జమ్ము-కశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో గగ్గోలు పెట్టింది. కానీ పాకిస్తాన్ రోధనను ఎవ్వరూ పట్టించుకోలేదు. చైనాను చేతిలో పెట్టుకొని భారత్ ను ముప్పు తిప్పలు పెట్టించవచ్చని అనుకున్న పాక్ కు చైనా కూడా ఇండియా వైపునకు మళ్లడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకుంది. చైనా, అమెరికాను చూస్తూ మురిసిపోయిన పాకిస్తాన్ రెండు దేశాల నుంచి ఎదురు దెబ్బలు తప్పలేదు. చైనా భారత్ మాకు మిత్ర దేశం అని చెప్పగా.. రీసెంట్ గా అమెరికా పాకిస్తాన్ పై సాంక్షన్స్ విధించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాక్ మెడపై మరో కత్తి వేలాడుతుంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు ఏ దేశం కూడా ఆర్థిక సాయం చేయడం లేదు. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ విలవిలలాడుతోంది. ఇప్పుడు చైనా కూడా తమ అప్పును తీర్చాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో మరింత సంకటంలో పడిపోయింది. ఇక బంగ్లాదేశ్ గురించి చెప్పుకుంటే అమెరికా పన్నిన వలలో పడింది. షేక్ హసీనా పాలనలో సుభిక్షంగా ఉన్న దేశం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. యూనస్ ప్రభుత్వం సంక్షోభాన్ని పట్టించుకోకుండా.. భారత్ పై విరోదం పెంచుకుంటూ మరింత దిగజారింది.
బంగ్లాదేశ్ కు ఆహార దినుసుల నుంచి విద్యుత్ వరకు భారతే అన్నీ సమకూరుస్తుంది. కరోనా సమయంలో సైతం ఉచిత టీకాలను భారతే పంపించి ఆదుకుంది. ఇంకా బట్టల నుంచి తినే ప్రతీ ఆహార దినుసు భారతదేశమే ఎగుమతి చేస్తోంది. కానీ బంగ్లా మాత్రం వాపు చూసుకొని బలుపుగా మురిసిపోతుంది. ఇప్పటికే హిందువులపై దాడులు పెరిగాయి. అక్కడి హిందువులు వాటిని తీవ్రంగా ఎదురిస్తున్నారు.
అంతర్జాతీయ సమాజం కూడా బంగ్లాదేశంలో దాడులపై మండిపడుతుంది. ఇలానే కొనసాగితే అంతర్జాతీయంగా బహిష్కరిస్తామని ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఇప్పటికీ భారత్ అంటే కొంచెం భయంగానే ఉంది బంగ్లాదేశ్. కానీ సరిహద్దులో మాత్రం ఇబ్బంది పెడుతుంది. భారత్ కూడా పిచుకపై బ్రహ్మాస్త్రం లాగా చూస్తూ సైలెన్స్ గా ఉంటోంది.
ఇటీవల భారత్ పెద్ద ఎత్తు వేసింది. ఎంతలా అంటే పాక్ ఐఎస్ఐ వద్ద కూడా దీనికి జవాబు లేనంతగా.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు మాదిరి.. ఒక్క చర్యతో రెండు దేశాలకు చెక్ పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు మొదటి నుంచి వైరం ఉంది. ఇటీవల కొన్ని దాడులు పెరగడంతో ఎల్ఓసీ వద్ద ఉన్న పాక్ జవాన్లు, ఆర్టిలరీ గన్స్, ఆప్ఘనిస్తాన్ వైపునకు తరలించింది పాక్. ఇక ఎల్ఏసీ వద్ద చైనాతో గొడవలు సద్దుమణగడంతో అక్కడి నుంచి భారత సైన్యాన్ని ఎల్ఓసీ వైపునకు భారత్ తరలించింది. ఇక మయన్మార్ రెబల్స్ బంగ్లాదేశ్ కు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్ సైలెంట్ అయిపోయింది. ఇలా ఒక్క దెబ్బకు భారత్ రెండు దేశాలకు చెక్ పెట్టింది.