మాజీ మంత్రి విద్యా సంస్థలు మూత పడాల్సిందేనా

మరో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆఘమేఘాల మీద విడుదల చేసింది. విద్యా శాఖ విడుదల చేసిన ఈ జిఓ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులు పూర్తయ్యాయి. మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు శిద్దా రాఘవరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా […]

Written By: Neelambaram, Updated On : June 15, 2020 9:28 pm
Follow us on


మరో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆఘమేఘాల మీద విడుదల చేసింది. విద్యా శాఖ విడుదల చేసిన ఈ జిఓ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మాజీ మంత్రి కె. అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులు పూర్తయ్యాయి. మరోవైపు ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు శిద్దా రాఘవరావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యా శాఖ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం మాజీ మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలకు కష్టాల్లో పడనున్నాయి.

ఇటీవల జీ.ఓ.ఎం.ఎస్ 23ను విద్యాశాఖ జారీ విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్ కు 40 మందిని మాత్రమే అడ్మిషన్ ఇచ్చేేందుకు అవకాశం ఉంటుంది. మార్చి 2002లో విడుదలైన జీ.ఓ 12ను సవరిస్తూ కొత్త జీఓను వైసీపీ ప్రభుత్వం జారీ చేసింది. సీబిఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఈ జీఓ జారీ చేసినట్లు విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. కనిష్టంగా 4 సెక్షన్ లకు 160 మంది, గరిష్టంగా 9 సెక్షన్ లకు 360 మందిని చేర్చుకునే విదంగా పరిమితి విదించారు. ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు గరిష్టంగా 360, 360 మొత్తం 720 మందిని మాత్రమే చేర్చుకోవాలి. గతంలో గరిష్టంగా 1,584 మందికి అవకాశం ఉండగా ఆ సంఖ్యను ఇప్పుడు కుదించారు.

దీంతో ప్రతి క్యాంపస్ లో సుమారు ఐదు నుంచి పది వేల సంఖ్యలో విద్యార్థులను ఉంచి కళాశాలను నిర్వహించే నారాయణ సంస్థకు ఈ ఉత్తర్వులతో సమస్యలు తప్పవని అంటున్నారు. మరోవైపు వేల సంఖ్యలో విద్యార్థులు ఉండే సంస్థలను, వందల సంఖ్యలో విద్యార్థులు ఉన్న సంస్థలను ఒకేగాటన కట్టి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ప్రవేటు జూనియర్ కళాశాల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రవేటు కళాశాలలు నిర్వహిస్తున్న చిన్న యాజమాన్యాలకు ముప్పు తప్పదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మాజీ మంత్రి నారాయణ, మరో టీడీపీ అనుకూల విద్యా సంస్థలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.