Homeజాతీయ వార్తలుOperation Chatru: కాశ్మీర్లో అతిపెద్ద ఆపరేషన్‌ ముగిసింది.. అసలేంటి ఆ యుద్ధం?

Operation Chatru: కాశ్మీర్లో అతిపెద్ద ఆపరేషన్‌ ముగిసింది.. అసలేంటి ఆ యుద్ధం?

Operation Chatru: జమ్మూకశ్మీర్‌లోని ఎన్‌కౌంటర్లు సాధారణమే. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అయినా అప్పుడప్పుడు ముష్కరులు విరుచుకుపడుతున్నారు. వీరికి కశ్మీర్‌లోని స్థానికులు సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు వీరిని కూడా గుర్తించే పనిలో కేంద్రం ఉంది. ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఉద్యోగులను కూడా తొలగిస్తోంది. అయితే కశ్మీర్‌లోని ఓ జిల్లాలోని ఓ కుగ్రామంలో ఉన్న ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చడానికి సైన్యానికి ఏకంగా 326 రోజులు పట్టింది. ఇన్ని రోజులు పట్టు వదల కుండా పట్టు సడలించకుండా ఏరియా మొత్తాన్ని చుట్టుముట్టి.. అడవిలో దాగి ఉన్న ఏడుగురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అయితే ఇంత సుదీర్ఘంగా ఆపరేషన్‌ జరగడం ఆశ్చర్యంగా ఉంది.

అడవిలో నక్కిన ముష్కరులు..
కిస్త్వార్‌ జిల్లా నుంచి జమ్మూ కశ్మీర్‌లోకి వెళ్లొచ్చు. దోడా ఉదంపూర్‌ దాడితే లడ్డాక్‌కు వెళ్లొచ్చు. నైరుతివైపు వెళ్తే రజౌరీ, పూంజ్‌కు వెళ్లొచ్చు. అక్కడి హజీపీర్‌ పాష్‌ కొండ ప్రాంతాల నుంచి పాకిస్తాన్‌ వెళ్లొచ్చు. ఇంతటి కీలకమైన కిస్త్వాడ్‌లో ఛాత్రు అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ నిత్యం మంచు కురుస్తుంది. వేళ్లు కొంకర్లుపోయే చలి ఉంటుంది. ఇక్కడి గుహల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారు. మంచు కురిసే చీకటి అడవుల్లో దాగి ఉన్న వీరిని పట్టుకోవడానికి సైన్యం అలుపెరుగని కృషి చేసింది.

Also Read: ఆ ఆలయ గర్భగుడి తెరవడానికి 122 ఏళ్లు.. ఇంతకాలం మూసివేత వెనుక పెద్ద కథే?

ఆపరేషన్‌ ఛాత్రు
ఆపరేషన్‌ ఛాత్రు పేరుతో చేపట్టిన సుదీర్ఘ ఆపరేషన్‌లో రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, జెకేపీల కలిసిన ప్రత్యేక బృందం పాల్గొంది. పక్కడ్బందీ, మిలటరీ ఇంటెలిజెన్స్‌పై ఆధారపడి 326 రోజులు ఆపరేషన్‌ నడిపింది. ఆరు సార్లు కాల్పులు జరిగాయి. మూడు ఎన్‌కౌంటర్లలో ముగ్గురిని మట్టుబెట్టారు. డ్రోన్‌లు, శాటిలైట్‌ ఇమేజెస్, అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ టూల్స్‌ ఉపయోగించారు.

హవల్దార్‌ మృతి..
గత జనవరి 18–19 తేదీల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో హవల్దార్‌ మృతి చెందాడు. ఇక ఫైనల్‌ ఎన్‌కౌంటర్‌ ఫిబ్రవరి 21, 22 తేదీల్లో జరిగింది. మిలటరీ డాగ్‌ టైసన్‌ గుహలో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించింది. ముష్కరుల కాల్పుల్లో గాయపడిన టైసన్‌.. పట్టుదలతో ఒకరిని పట్టుకుంది. తర్వాత సైన్యం అక్కడికి చేరుకుని ముగ్గురినీ మట్టుబెట్టారు. ఇందులో ఒకరు కశ్మీర్‌కు చెందిన జైష్‌–ఎ–మహ్మద్‌ కమాండర్‌ సైఫుల్లా, మరో ఇద్దరు పాకిస్తానీలు. మొత్తానికి 326 రోజుల ఆపరేషన్‌ముగిసింది. తర్వాత గాయపడిన టైసన్‌ను హెలిక్యాప్టర్‌లో శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.

326 రోజులు సాగిన ఆపరేషన్‌లో సైన్యం త్యాగాలు, సాంకేతికత శ్రేయస్సును చాటింది. ఉగ్రవాదులను పూర్తిగా ధ్వంసం చేసి ప్రాంత భద్రత బలపడింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular