Telangana Ministers : త్రి మూర్తులే..! తెలంగాణ ప్రభుత్వంలో మాట్లాడేది ఆ ముగ్గురేనా!

Telangana Ministers : తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో మంది మంత్రులున్నారు. కానీ బయట ప్రపంచానికి కనిపించేది.. మాట్లాడేది కేవలం ముగ్గురు మంత్రులే. మిగతా వాళ్లంతా జిల్లాలకే పరిమితం.. ఆ జిల్లా దాటి బయటకు రారు. ఎప్పుడో కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెడితేనే వాళ్లు కనిపిస్తారు. కేసీఆర్ పక్కన వీళ్లు ఉన్నారని తెలుస్తుంది. అంతే తప్పితే ప్రభుత్వంలో వీరి పాత్ర నామమాత్రం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో త్రిమూర్తుల రాజ్యం నడుస్తుంది. ప్రభుత్వ గొప్ప తనం చెప్పుకోవాలి […]

Written By: NARESH, Updated On : March 9, 2022 6:12 pm
Follow us on

Telangana Ministers : తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో మంది మంత్రులున్నారు. కానీ బయట ప్రపంచానికి కనిపించేది.. మాట్లాడేది కేవలం ముగ్గురు మంత్రులే. మిగతా వాళ్లంతా జిల్లాలకే పరిమితం.. ఆ జిల్లా దాటి బయటకు రారు. ఎప్పుడో కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెడితేనే వాళ్లు కనిపిస్తారు. కేసీఆర్ పక్కన వీళ్లు ఉన్నారని తెలుస్తుంది. అంతే తప్పితే ప్రభుత్వంలో వీరి పాత్ర నామమాత్రం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telangana Ministers

తెలంగాణ ప్రభుత్వంలో త్రిమూర్తుల రాజ్యం నడుస్తుంది. ప్రభుత్వ గొప్ప తనం చెప్పుకోవాలి అన్న.. కేసీఆర్ ని పొగడాలి అన్న.. ప్రతిపక్షాలను తిట్టాలి అన్న తమకు అధికారం హక్కు ఉన్నట్లుగా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని వ్యవహరిస్తున్నారు. మిగతా మంత్రులెవరు మీడియా ముందు నోరు విప్పేందుకు కూడా సాహసం చేయడం లేదు. కనీసం అభివృద్ధి గురించి చెప్పుకునే ముందు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఏమీ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

-అభివృద్ధి అంతా వాళ్ల నియోజకవర్గాల్లోనే..
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా మారుస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిని అంతా కొందరికే పరిమితం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన గజ్వేల్.. ఆయన అల్లుడు నియోజకవర్గం సిద్దిపేట.. కొడుకు నియోజకవర్గం సిరిసిల్లతో పాటు.. హైదరాబాదులో కీలకంగా వ్యవహరిస్తున్న తలసాని నియోజకవర్గాలకు మాత్రమే అభివృద్ధిలో అగ్రతాంబూలం దక్కుతుంది. ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక.. బడ్జెట్లో కేటాయింపులు లేకున్నా భారీగా నిధులు కేటాయించు కుంటున్నారు. ఇక కొడుకు అల్లుడు ఏది అడిగితే అది కాదనకుండా ప్రణాళిక బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఇష్టానుసారంగా నిధులు కేటాయిస్తున్నారు. ఇక రాజధాని నగరంలో చిలక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉంటూ తనకు కావలసిన పనులు చేయించుకుంటున్నారు. ఈ నియోజకవర్గసు మినహా మిగతా మంత్రుల నియోజకవర్గాలు.. అభివృద్ధిలో వీరికి కనీసం పది శాతం కూడా జరిగిన దాఖలాలు లేవు. దీంతో అభివృద్ధి గురించి చెప్పడానికి నియోజకవర్గంలోని మిగతా 14 మంది మంత్రులు వెనుకాడుతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడినా ఎక్కడ దొరికిపోతావు అని.. ప్రతిపక్షాలు ఎక్కడ నిలదీస్తాయి అని కనీసం మాట్లాడడానికి కూడా జంకుతున్నారు.

Also Read: TS Teachers Promotion: ఉపాధ్యాయుల పదోన్నతులకు సీఎం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ మంత్రులు అభివృద్ధిపై ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకే మీడియా ముందు రాలేక ముఖం చాటేస్తున్నారన్న ఆవేదన ఉందన్న ప్రచారం సాగుతోంది. ఏం మాట్లాడినా ఏం కాంట్రవర్సీ అవుతుందో అన్న భయం వెంటాడుతోందంటున్నారు. ఇది రాష్ట్ర మంత్రుల పరిస్థితి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

తెలంగాణ కేబినెట్ లో ఇప్పుడు కేసీఆర్ చెప్పిందే వేదంలా ఉంది. ఎందుకంటే 90మందికి పైగా ఎమ్మెల్యేల బలం కేసీఆర్ సొంతం. ఎవ్వరూ తోకజాడించినా.. అసమ్మతి రాజేసినా పార్టీలో భవిష్యత్ ఉండదన్న భయం ‘ఈటల రాజేందర్’ ఎపిసోడ్ తో నిరూపితమైంది. మంత్రి పదవిని కూడా ఈటల కోల్పోయారు. అనంతరం ఎన్నికలకు వెళ్లి ఆపసోపాలు పడ్డారు. ఆర్థిక నష్టంతోపాటు కేసుల పాలయ్యారు. ప్రజల ఆశీర్వాదంతో ఈటల గెలిచినా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేయడంలో కేసీఆర్ విజయం సాధించారు. అందుకే అధికార పార్టీ నుంచి దూరం కావడానికి.. ఆ అధికారం కోల్పోవడానికి మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. కేసీఆర్ బలంగా ఉన్నంత వరకూ ఆయనను ఎదురించే సాహసం చేయరు. అందుకే ఇప్పుడు ఎంత ప్రాధాన్యత లేకున్నా కూడా ఎవరూ నోరు మెదపని పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి వస్తే.. అధికారం చివరి దశలో ఈ అసంతృప్తి జ్వాల ఎగిసే అవకాశం ఉంది. అప్పటివరకూ తెలంగాణ ప్రభుత్వంలో మాట్లాడేది ఆ ముగ్గురు మంత్రులే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: RCB New Captain 2022: ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఎవ‌రు.. ఈ సారైనా క‌ప్ కొడుతారా.. టీమ్ బ‌లాబ‌లాలు ఏంటి..?