https://oktelugu.com/

ఓటుకు నోటు కేసు: రేవంత్, సండ్రలకు బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు

ఓటుకు నోటు కేసులో ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది. 2015లో టీడీపీ మహానాడులో దీనికి బీజం పడింది. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్ లో స్చెచ్ గీశారు. 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు. ఎవరు తెచ్చారు? ఇలా పక్కా ఆధారాలతో ఏసీబీ తాజాగా కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ ఆధారాలు చూశాక మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, ఇక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తప్పించుకోవడం కష్టమన్న ప్రచారం సాగుతోంది. Also Read: కల్తీ నూనెల… […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 11:33 AM IST
    Follow us on

    ACB trap for Revanth and Sandra

    ఓటుకు నోటు కేసులో ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించింది. 2015లో టీడీపీ మహానాడులో దీనికి బీజం పడింది. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్ లో స్చెచ్ గీశారు. 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారు. ఎవరు తెచ్చారు? ఇలా పక్కా ఆధారాలతో ఏసీబీ తాజాగా కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ ఆధారాలు చూశాక మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, ఇక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తప్పించుకోవడం కష్టమన్న ప్రచారం సాగుతోంది.

    Also Read: కల్తీ నూనెల… గల్తీ దందా.!

    ఓటుకు నోటు కేసు కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని.. ఈ కేసు నుంచి తన పేరు తొలగించారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటీషన్లపై ఏసీబీ ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది.

    టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వాదనను ఏసీబీ తోసిపుచ్చింది. ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను డబ్బుతో ప్రలోభపెట్టడానికి రేవంత్ రెడ్డి, ముత్తయ్య తదితరులతో కలిసి సండ్ర కూడా ఈ కుట్రలో భాగస్వామిగా మారారని ఏసీబీ కౌంటర్ లో పేర్కొంది. తెలుగుదేశం పార్టీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది.

    ఓటుకు కోట్లు కేసు నిరూపించేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని.. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జు పిటీషన్లను కొట్టివేయాలని ఏసీబీ కోర్టులో వాదించింది. దీంతో కోర్టు విచారణను 27కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఏసీబీ పక్కా ఆధారాలతో ఈ కేసులో ముందుకెళుతోందని.. రేవంత్ రెడ్డి , సండ్ర సహా నిందితులు తప్పించుకునే చాన్స్ లేదని ప్రచారం సాగుతోంది.

    Also Read: దసరా తర్వాతే ఆర్టీసీ బస్సులా?

    ఏసీబీ వేసిన కౌంటర్ లో శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఇదే అంశంపై రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని.. ఫోన్ కాల్స్, వాయిస్ కాల్స్ లోనూ సండ్ర ప్రమేయం స్పష్టంగా ఉన్నదని పేర్కొంది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని వివరించింది. రేవంత్ రెడ్డి అనుచరుడు ఉదయసింహ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చేందుకు రూ.50 లక్షలను తీసుకొచ్చారని ఏసీబీ కౌంటర్ లో పేర్కొంది. వేం కృష్ణకీర్తన్ రెడ్డి నుంచి ఉదయసింహను రూ.50 లక్షలను రేవంత్ రెడ్డి తెప్పించారని ఏసీబీ పేర్కొంది.దీనిపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.

    ఈ క్రమంలోనే కోర్టు విచారణను 27కు వాయిదా వేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర సహా మిగతా వారు తప్పించుకోవడం కష్టమన్న ప్రచారం సాగుతోంది.