https://oktelugu.com/

ఉద్యమాలు చేస్తున్నా ఫలితమేంటి?

దేశంలో ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. అందులో విజయం సాధించినవి కొన్ని. అపజయాలు మూటగట్టుకున్నవి కూడా ఉన్నాయి. అమరావతి రాజధాని కావాలని ఐదు వందల రోజులుగా ఉద్యమాలు చేస్తున్నాపట్టించుకోవడం లేదు. అదే కోవలో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయరాదని కార్మికులు ఉద్యమిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రకటనలే తప్ప పనులు కనిపించడం లేదని వాపోతున్నారు స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. […]

Written By: , Updated On : May 22, 2021 / 05:30 PM IST
Follow us on

Amaravathi Movement

దేశంలో ఎన్నో రకాల ఉద్యమాలు జరిగాయి. అందులో విజయం సాధించినవి కొన్ని. అపజయాలు మూటగట్టుకున్నవి కూడా ఉన్నాయి. అమరావతి రాజధాని కావాలని ఐదు వందల రోజులుగా ఉద్యమాలు చేస్తున్నాపట్టించుకోవడం లేదు. అదే కోవలో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయరాదని కార్మికులు ఉద్యమిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రకటనలే తప్ప పనులు కనిపించడం లేదని వాపోతున్నారు స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నిర్ణయాలు ముందే జరిగిపో్యాయి. ఇక పనులు ప్రారంభించడమే తరువాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్లాంట్ కొనడానికి కొన్ని సంస్థలు ముందు వస్తున్నాయి.

స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ నుంచి పలు సంఘాల నేతల్ని పిలిపించి ప్రసంగాలు వినిపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యమం కాస్త మందగించినా ఆక్సిజన్ ఉత్పత్తి మరోసారి అవసరం కావడంతో స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యత గుర్తించాలని మొత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. అయితే అమరావతి రైతులకు, విశాఖ ఉద్యమానికి ఒకటే తేడా విశాఖ ప్లాంట్ కు ప్రభుత్వం సైతం వ్యతిరేకత తెలుపుతోంది.

భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు పని మాత్రమే చేయి ఫలితం ఆశించకు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రజల్ని మభ్య పెట్టడానికే ప్రభుత్వాలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని నిజం. అమరావతి రైతులు, స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులైనా ఇలా ఉద్యమాలు చేస్తూనే ఉంటారు. కానీ ఫలితం మాత్రం కనిపించదు. ఐదు వందల రోజులుగా ఉద్యమం చేస్తున్నా ఇప్పటి వరకు శుభవార్త విన్న దాఖలాలు లేవు. అంటే ఉద్యమం చేసినా ఫలితం శూన్యమే.