Newly-married woman: ఇంజినీర్ ఉద్యోగం.. లక్షల్లో వేతనం.. సజావుగా సాగుతున్న కాపురం ఏంటి సమస్యలు. ఎందుకు తనువు చాలించాల్సి వచ్చింది. బెంగుళూరులో కొత్తగా కాపురం పెట్టిన ఓ యువ జంటలో ఒకరు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. సంసారం సజావుగా సాగితే తీయని తలపులు గొడవలు జరిగితే తలవంపులు తెస్తాయి. దీంతో పచ్చని సంసారంలో చిచ్చు రేగింది. దంపతుల్లో గొడవలు చివరికి వారిని కష్టాలపాలు చేసింది.

భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కానీ అవి రాత్రి వచ్చి పొద్దున్నే పోయేలా ఉండాలి కానీ ప్రాణాలే పోయేలా ఉండకూడదు. నిత్యం గొడవలతో ఎవరు కూడా సంసారం చేయలేరు. ఈ నేపథ్యంలో భార్య భర్త పెట్టే వేధింపులు భరించలేక తనువు చాలించడం గమనార్హం. నూతన వధూవరులైనా జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకుంది.
బెంగుళూరులోని అమృతహళ్లిలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఇంజినీర్లు నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. జీవితం అందంగా తీర్చిదిద్దుకోవాలని కలలు కన్నారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కానీ మనమొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు వారి విధి వక్రించింది. ఏం జరిగిందో తెలియదు కానీ అన్యోన్య సంసారంలో అగ్ని రాజేసింది. గొడవలు రేగి చివరకు విరక్తి వరకు దారి తీసింది.
Also Read: Actress Samantha: అస్వస్థత కు గురైన నటి సమంత… ఆరోగ్య విషయంపై క్లారిటి ఇచ్చిన ఆమె మేనేజర్
భర్త వినయ్ పెట్టే వేధింపులు తాళలేక భార్య సంగీత క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో సూసైడ్ నోట్ లభించినా అందులో ఏముందనేది పోలీసులు మాత్రం తెలియనీయడం లేదు. వినయ్ ను మాత్రం అరెస్టు చేశారు. కానీ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాలేదు. దీంతో సంగీత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read: AP Politics: హత్యారోపణల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు..!