Delhi Liquor Scam: వదల బొమ్మాలి నిన్ను వదల అంటూ ఢిల్లీ లిక్కర్ స్కాం ఎమ్మెల్సీ కవిత వెంటపడుతున్నది. మొన్న దీని విషయమే సెటిల్ చేసేందుకు సీఎం కేసీఆర్ వారం రోజులపాటు ఢిల్లీలో మకాం వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలతో సంప్రదింపులు జరిపారు. అయినప్పటికీ పెద్దగా ఫాయిదా లేకుండా పోయింది. ఏకంగా ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ను కార్నర్ చేసిన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్.. ఈసారి మరిన్ని కొత్త ఎత్తులు వేస్తోంది. దీనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోడు కావడంతో లిక్కర్ స్కాం రోజుకు మలుపు తిరుగుతోంది. ఇక ఈ స్కాంలో కింగ్ ఫిన్ అయిన రామచంద్ర పిళ్ళై మొదట అప్రూవర్ గా మారతాడు అనుకున్నాడు. కానీ అతడు సహకరించకపోవడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు రూటు మార్చారు.

కెసిఆర్ నిర్ణయం వల్లనేనా
కాలేశ్వరం, ఇతరత్రాభివృద్ధి కార్యక్రమాల సంబంధించి ని దులు పక్కదారి పట్టాయి అనే సమాచారంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొద్దిరోజులుగా కెసిఆర్ కుటుంబంతో కాన్సన్ట్రేట్ చేసింది. దీనికి సంబంధించి బిజెపిలో ఉన్న తన వేగుల ద్వారా సమాచారం తెప్పించుకున్న కేసీఆర్.. వెంటనే అలర్ట్ అయ్యాడు. తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, వివిధ దర్యాప్తు సంస్థల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ మధ్య బీహార్ వెళ్ళినప్పుడు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీద రకరకాల ఆరోపణలు చేయించాడు. తర్వాత ఇటీవల సిబిఐ అధికారులు తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉండేందుకు ఒక జీవో విడుదల చేశాడు. లిక్కర్ స్కాం లో కవిత ఇరుక్కున్నందువల్లే కెసిఆర్ సీబీఐ పై యుద్ధం ప్రకటించాడని తెలుస్తోంది.
కెసిఆర్ ఎత్తుకు పై ఎత్తు
ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడుగా ఉన్న దినేష్ ఆరోరా ను సి.బి.ఐ అప్రూవర్ గా మార్చింది. రామచంద్ర పిల్లై అప్రూవర్ గా మారతారని అందరూ అనుకున్నారు. కానీ తెరపైకి దినేష్ పేరును సిబిఐ తీసుకొచ్చింది. ఆయనను సాక్షిగా పరిగణించాలని సిబీఐ కోర్టును కోరింది. లిక్కర్ స్కాంలో సిబిఐ అరెస్టు చేసిన వారిలో దినేష్ ఒకడు. సమీర్ మహేంద్రు మరొక నిందితుడు. దినేష్ నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ బ్యాంకు ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్టు సిబిఐ విచారణలో తెలిపింది. దినేష్ అరోరా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా నిందితులందరిపై ఐపిసి సెక్షన్ 120బీ, 477 ఏ తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో 2001, 2002 లో రూపొందిన ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత జూలైలో సీబీఐ విచారణకు ఆదేశించారు.

గత ఏడాది నవంబర్ 17న అమలులకు వచ్చిన ఈ విధానంలో భాగంగా ఢిల్లీ నగరాన్ని 32 జోన్లుగా విభజించారు. 849 షాపులకు సంబంధించిన ప్రైవేట్ బిడ్డర్ లకు రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. విధానాన్ని బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేకించాయి. లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేశాయి.. ఇంకా ఈ లిక్కర్ స్కాంలో కవిత పీఏ బోయినపల్లి అభిషేక్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడు బయటికి వస్తే సాక్షాలు తారుమారు చేస్తాడని సిబిఐ ఇవ్వకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు దినేష్ ఆరోరా అప్రూవర్ గా మారడంతో కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది.. మునుగోడు లో టిఆర్ఎస్ విజయం సాధించిన అనంతరం సిబిఐ దినేష్ ఆరో రాను అప్రూవర్ గా ప్రకటించడం గమనార్హం. అయితే త్వరలోనే కవితను కూడా విచారించి అరెస్టు చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కెసిఆర్ ఎర్రజెండా పాతడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.