Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా బలమైన చర్చ ప్రారంభమైంది. ఏపీలో మాదిరిగా రాజకీయ వేధింపులకు
పాల్పడితే మాజీ సీఎంలు జైలు పాలు కావాల్సిందే. సాధారణంగా ప్రభుత్వం అంటేనే ఒక వ్యవస్థతో కూడికున్నది. దానికి ప్రజలు కోరుకున్న ప్రభుత్వం నడిపిస్తుంది. ప్రజల అభిమతానికి తగ్గట్టుగా పాలన అందిస్తుంది. కానీ అమలు చేసే బాధ్యత మాత్రం యంత్రాంగానిది. కానీ ప్రస్తుతం ఏపీలో యంత్రాంగం నామమాత్రం. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుతో ఇది స్పష్టంగా తేలిపోయింది. జీవోలు జారీ చేసిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన వారు, డబ్బులు విడుదల చేసి చెల్లించిన వారు, ప్రాజెక్టును అమలు చేసిన వారు.. వీరంతా ఏ నేరం చేయలేదట. ఒక్క సీఎంగా వ్యవహరించిన చంద్రబాబే అంతా చేశారట. ప్రభుత్వం అంటేనే సీఎం అనే వన్ మాన్ షో లా భావించి సిఐడి వరస కేసుల్లో చంద్రబాబునే బాధ్యుడిగా చూపుతోంది. దీంతో దేశవ్యాప్తంగా జగన్ తప్పించి.. మిగతా సీఎం లంతా భయపడిపోతున్నారు. రేప్పొద్దున్న వివిధ కేసుల్లో నేరుగా బోను ఎక్కాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తీర్పురానుంది. అందులో ఏదో ఒకటి స్పష్టం కానుంది. ఇప్పుడు ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చారు. అందులో నిధుల దుర్వినియోగాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ చంద్రబాబు నిందితుడిగా చెబుతున్నారు. ఆ కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి సన్నిహితుడు కావడంతో చంద్రబాబు తప్పు చేశాడని చూపుతున్నారు. రాజకీయంగా ఆరోపణలు చేయడానికి.. తాత్కాలికంగా రిమాండ్లు విధించడానికి ఇవి బాగుంటాయి ఏమో కానీ.. అంతిమంగా న్యాయస్థానాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెగ్గలేవు. కనీసం ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఒకవైపు న్యాయ కోవిదులు, నిపుణులు చెబుతున్నారు. లోతుగా అడుగుతుంటే దర్యాప్తు చేస్తున్నామన్న మాట వినిపిస్తోంది. దర్యాప్తులో ఉంది కాబట్టి చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దని వాదిస్తున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు చాలదన్నట్టు ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. దీనికిగాను ఖర్చు 1000 కోట్లకు పైగానే ఉంటుంది. అంత ఖర్చు పెట్టలేక.. వైర్లను విద్యుత్ స్తంభాల మీదుగా వేయడంతో ఖర్చు తగ్గింది. దీంతో ప్రజలకు 149 రూపాయలకే ఇంటర్నెట్ తో సహా కేబుల్ టీవీ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని ధర కూడా పెరిగింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని తెలుగుదేశం పార్టీ శ్వేతపత్రం విడుదల చేసింది. అన్ని నిబంధనలు ప్రకారమే జరిగాయని చెప్పుకొస్తోంది. కానీ కేసు నమోదు చేసిన నాలుగున్నర ఏళ్ల తర్వాత చంద్రబాబును ఏ 25 గా చర్చి పీటీ వారెంట్ దాఖలు చేయడం విశేషం.
అవినీతి జరిగితే నిరూపించాలి. మనీలాండరింగ్ అని ఆరోపిస్తే.. డబ్బు ఎలా చేరిందో చూపాలి. కానీ ఒక్క రూపాయి కూడా చూపించలేకపోతున్నారు. కేవలం సన్నిహితుడికి అందాయని.. వారంతా బినామీలేనని చెబుతుండడం విశేషం. ఫైళ్లు పోయాయని ఒకసారి .. ఊహాజనిత ఆరోపణలతో మరోసారి వాదనలు వినిపిస్తున్నారు. అమలు చేసిన అధికారులకు బాధ్యత లేదట.. పర్యవేక్షించే వారికి సైతం ప్రమేయం లేదట.. నేరుగా సీఎం బాధ్యుడట. ఈ లెక్కన సీఎం జగన్ ఎన్నిసార్లు బాధ్యులు అవ్వాలి. దేశవ్యాప్తంగా ఉన్న సీఎంల పరిస్థితి ఏమిటి. వారు మాజీలు అయిన మరుక్షణం ఈ లెక్కన బాధ్యులవుతారు అన్నమాట. మరి ఇందులో కిటుక ఏమిటో ఏపీ సిఐడి కి ఎరుక.