జేసీ మెడకు చుట్టుకున్న మరో కొత్త కేసు!

టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర రెడ్డి పై మరో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఆయన కంపెనీలో జేసీ ట్రావల్స్ సంస్థ వాహానాల పోర్జరీ కేసులో మరో కోణం బయటపడింది. వారు కేవలం ఎస్.ఐ,సి.ఐ వంటి పోలీసు అధికారుల సంతకాలను పోర్జరీ చేయడమే కాకుండా ఏకంగా ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో కూడా డాక్యుమెంట్లు సృష్టించటంతో.. దీనిపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై విచారణ జరుపుతున్న రవాణాశాఖ టాస్క్‌ఫోర్స్‌ బృందం.. […]

Written By: Neelambaram, Updated On : February 29, 2020 5:52 pm
Follow us on

టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర రెడ్డి పై మరో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ఆయన కంపెనీలో జేసీ ట్రావల్స్ సంస్థ వాహానాల పోర్జరీ కేసులో మరో కోణం బయటపడింది. వారు కేవలం ఎస్.ఐ,సి.ఐ వంటి పోలీసు అధికారుల సంతకాలను పోర్జరీ చేయడమే కాకుండా ఏకంగా ఇన్సూరెన్స్ కంపెనీ పేరుతో కూడా డాక్యుమెంట్లు సృష్టించటంతో.. దీనిపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు పిర్యాదు చేశారు. జేసీ ఫోర్జరీ వ్యవహారంపై విచారణ జరుపుతున్న రవాణాశాఖ టాస్క్‌ఫోర్స్‌ బృందం.. ఇప్పటివరకు 56 నకిలీ ఇన్సూరెన్స్‌ సర్టిఫికేట్లను గుర్తించింది.

బీఎస్‌-3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్‌తో బీఎస్‌-4గా రిజిస్ట్రేషన్‌ చేయించారు. నాగాలాండ్‌, కర్ణాటక రాష్ట్రాలలో 154 లారీలను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటిదాకా 20లారీలను సీజ్‌ చేశారు. మిగిలిన వాహనాలను జేసీ ట్రావెల్స్‌ అజ్ఞాతంలోకి తరలించారు. రెండు లారీలను బస్సులుగా మార్చేసి వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన ఫేక్‌ ఇన్సురెన్స్‌ సర్టిఫికేట్ల బాగోతంపై రవాణా శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.