Minister Roja: మినిస్టర్ రోజా.. తరచూ వివాదాల్లో చిక్కుతోంది. ఇటీవలే టీడీపీ మాజీ మంత్రి రోజాపై తీవ్ర ఆరోపణలు చేశారు. రోజా ఫిర్యాదుతో అరెస్ట్ అయి బయటకు వచ్చాడు. ఈ సందర్భంగా కొంతమంది ఆమో పాత వీడియోలను కూడా నెట్టింట్లో ట్రోల్ చేశారు. అయినా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆమెకు మద్దతు లభించలేదు. అయితే రోజాకు మొదటి నుంచి నోటి దురుసు ఎక్కువ. దీంతో ఆమెను సపోర్టు చేయడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు. ఈ క్రమంలో మంత్రి రోజా మెగా ఫ్యామిలీ పై విమర్శలు చెయ్యడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. మెగా అభిమానులు రోజాపై చాలా తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు.. ‘పిల్లికి బిచ్చమ్ పెట్టే అలవాటు కూడా లేని నువ్వు మెగా బ్రదర్స్‌ని అనే రేంజ్ కి వచ్చావా..నువ్వెంత నీ బ్రతుకెంత..పదవిలో ఉన్నావు కదా అని నోటికి ఏది పడితే అది వాగితే దవడ పళ్లు రాలగొడతాం’ అంటూ రోజాని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ తిడుతున్నారు.
ఘాటుగా స్పందించిన నాగబాబు..
రోజా కామెంట్స్ పై నాగబాబు కూడా చాలా ఘాటుగా స్పందించాడు. సినిమా ప్రమోషన్స్ కోసం అనేక మీడియా సంస్థ లకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తనపై గతంలో విమర్శలు చేసిన రోజాకు ఘాటుగా రిప్లై ఇచ్చారు.
చిరంజీవి చురకలు..
తాజాగా చిరంజీవి కౌంటర్ ఇస్తూ నన్ను తిడితేనే వాళ్లకి గుర్తింపు లభిస్తుంది.
అడ్డా దారిలో గుర్తింపు కోరుకునే వారు నన్ను, నా ఫ్యామిలీని తిడుతుంటారు. ఇటీవల నా ఇంటికి కూడా వచ్చి వెళ్లారు. ‘నేను ఎవరికీ సహాయం చేయలేదని, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని అంటున్నారు. నా గురించి అందరికీ తెలుసు, అది వారికి కూడా తెలుసు’ అంటూ చురకలు అంటించారు చిరు.
వివాదాలకు చిరు దూరం..
సాధారణంగా చిరంజీవి వివాదాలకు దూరంగా ఉంటారు. రాజకీయాలకు కూడా గుడ్‌బై చెప్పారు. అయినా కొంతమంది పనిగట్టుకుని చిరంజీవిని టార్గెట్ చేయడమే మెగా ఫ్యాన్స్‌కు నచ్చడం లేదు. రాజకీయాల్లో ఉన్న పవన్‌ను విమర్శిస్తే పెద్దగా స్పందించడం లేదు. కానీ సైలెంట్‌గా ఉన్న చిరంజీవిని రాజకీయాల్లోకి లాగడమే వివాదాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో తాజాగా మినిస్టర్ రోజా మెగా ఫ్యాన్స్‌కు బుక్కయ్యారు.