https://oktelugu.com/

Sri Lanka Crisis: శ్రీలంకలో ఆరని ఆగ్రహజ్వాలలు.. రాజపక్స మద్దతు దారుల దాడులతో రెచ్చిపోయిన జనం

Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు పరిస్థితి అదుపు తప్పుతోంది. దీంతో సామాన్యుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతోంది. ధరలు ఆకాశాన్నంటడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన హింస హద్దులు దాటింది. ప్రజాప్రతినిధుల ఇళ్లను తగులబెట్టారు. ఓ ఎంపీని కూడా హతమార్చారు. అయినా అల్లర్లు చల్లారలేదు. ప్రజాగ్రహానికి దేశం తట్టుకోలేకపోతోంది. సోమవారం మొదలైన దహనకాండ ఇంకా చల్లారడం లేదు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 10, 2022 / 09:10 AM IST
    Follow us on

    Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు పరిస్థితి అదుపు తప్పుతోంది. దీంతో సామాన్యుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతోంది. ధరలు ఆకాశాన్నంటడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన హింస హద్దులు దాటింది. ప్రజాప్రతినిధుల ఇళ్లను తగులబెట్టారు. ఓ ఎంపీని కూడా హతమార్చారు. అయినా అల్లర్లు చల్లారలేదు. ప్రజాగ్రహానికి దేశం తట్టుకోలేకపోతోంది.

    Sri Lanka Crisis

    సోమవారం మొదలైన దహనకాండ ఇంకా చల్లారడం లేదు. ఎట్టకేలకు ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్సే రాజీనామా చేశారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాత్రం రాజీనామా చేసేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది. రాజపక్స మద్దతుదారులు జరిపిన దాడులతో కోపోద్రిక్తులైన ప్రజలు రెచ్చిపోయారు. ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది. సైనిక బలగాలను రంగంలోకి దింపినా జనం మాత్రం తగ్గలేదు.

    Also Read: TDP Looking For Alliances: పొత్తుల కోసం టీడీపీ ఆరాటంలో అర్థముందా?

    దేశంలో నెలరోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సోమవారం రాజపక్స మద్దతుదారులు దాడికి పాల్పడటంతో పరిస్థితి అదుపు తప్పింది. ప్రజలు ఆయన అనుచరుల పరస్పరం దాడులతో ఉద్రిక్తంగా మారింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు ప్రజాప్రతినిధుల ఇళ్లకు నిప్పు పెట్టే వరకు వెళ్లింది. ఎంపీలు సహా అధికార పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలు, వాహనాలను తగులబెట్టారు. రాజపక్స మద్దతుదారుల దాడిలో 154 మంది గాయపడ్డారు.

    Sri Lanka Crisis

    దేశవ్యాప్తంగా ఆందోళనలు పేట్రేగిపోతున్నాయి. మాజీ మంత్రి జాన్ స్టాన్ ెర్నాండో ఆస్తులతో పాటు ఇళ్లను తగులబెట్టారు. మరో మాజీ మంత్రి నిమల్ బాన్డా, మేయర్ సమన్ లాల్ ఫెర్నాండో, అధికార పార్టీ నేత మహేంద కహన్ డగమగేల ఇళ్లను దహనం చేశారు. దీంతో దేశంలో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. నేతల తీరుతో ప్రజలు రెచ్చిపోయారు. రాజపక్స అనుచరుల తీరుతో ప్రజల్లో ఆగ్రహం పెరిగి దాడుల వరకు వెళ్లింది.

    Also Read:Cyclone Alert In AP: ఏపీకి హైఅలర్ట్.. తీవ్ర తుఫాను హెచ్చరిక

    Tags