డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు వివాదాస్పదం

ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కరోనా వ్యాప్తికి ఒక సామాజిక ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీకి పోయి పంక్షన్లు చేసుకుని, ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చేస్తున్నారని, ఇకనైనా శుభ్రంగా ఉండాలంటూ నారాయణ స్వామి సూచించారని తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన ముస్లింలు వైద్యులకు సహకరించడం లేదని, ఆసుపత్రుల్లో భౌతిక దూరం పాటించలేదని, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని వ్యాఖ్యనించారని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నయి. […]

Written By: Neelambaram, Updated On : April 12, 2020 7:52 pm
Follow us on


ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కరోనా వ్యాప్తికి ఒక సామాజిక ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీకి పోయి పంక్షన్లు చేసుకుని, ప్లేట్లు, స్పూన్లు నాకుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చేస్తున్నారని, ఇకనైనా శుభ్రంగా ఉండాలంటూ నారాయణ స్వామి సూచించారని తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌ వచ్చిన ముస్లింలు వైద్యులకు సహకరించడం లేదని, ఆసుపత్రుల్లో భౌతిక దూరం పాటించలేదని, ఇకనైనా పద్దతి మార్చుకోవాలని వ్యాఖ్యనించారని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నయి.

సీఎం జగన్ మాత్రం కరోనాకు కులం, మతం లేదని చెబుతున్నారు. మర్కజ్‌ ఘటనకు మతం ముద్ర వేయడం సరికాదని ఆయన అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనల్ని అతిక్రమించవద్దని, భౌతికదూరం పాటిస్తూ కరోనాను తరిమేద్దామని జగన్‌ పిలుపునిచ్చారు. ఆయన మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ ప్రభావం ప్రభుత్వంపై పడింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో నారాయణస్వామిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ముస్లిం సంఘాల పెద్దలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

మరోవైపు ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె. నారాయణస్వామి తెలిపారు. జమాత్ నుంచి వచ్చిన ముస్లిం లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించే ప్రయత్నం చేశానని, కరోనా చికిత్స పొందుతున్న రోగులు వైద్యులకు సహకరించడం, ఇతరులకు వైరస్ అంటుకోకుండా జాగ్రత్త పడాలన్నదే నా ఉద్దేశమన్నారు. ప్రతీ మతస్థుడు తమ ఆరాధ్య దైవాలను పూజించుకోవచ్చని చెప్పారు. భావ వ్యక్తీకరణ లోపం కారణం గానే నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయని తెలిపారు.

అంతేగాని ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదని, నాకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉందన్నారు. ఈ విషయాన్ని నా ఆత్మసాక్షి గా చెబుతున్నట్లు తెలిపారు. నేను కూడా అణగారిన ఎస్సి వర్గానికి చెందిన వాడినేన్నారు.