Nara Lokesh – Yash : KGF హీరో యాష్ తో నారా లోకేష్ మంతనాలు..అసలు కారణం అదేనా!

Nara Lokesh – Yash : కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన హీరో యాష్ అంటే తెలియని వాళ్లంతా ఎవ్వరూ ఉండరు..తెలుగునాట కూడా ఆయనకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ఈయనతో సినిమాలు తియ్యడానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సైతం క్యూ కడుతున్నారు..కేవలం టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాదు..బాలీవుడ్ మరియు కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఇతను డేట్స్ ఇస్తే చాలు అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక కన్నడ హీరో కోసం ఇండియన్ క్రేజీ […]

Written By: NARESH, Updated On : December 15, 2022 9:09 pm
Follow us on

Nara Lokesh – Yash : కేజీఎఫ్ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన హీరో యాష్ అంటే తెలియని వాళ్లంతా ఎవ్వరూ ఉండరు..తెలుగునాట కూడా ఆయనకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..ఈయనతో సినిమాలు తియ్యడానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ సైతం క్యూ కడుతున్నారు..కేవలం టాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రమే కాదు..బాలీవుడ్ మరియు కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఇతను డేట్స్ ఇస్తే చాలు అనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఒక కన్నడ హీరో కోసం ఇండియన్ క్రేజీ డైరెక్టర్స్ అందరూ ఇంతలా ఎదురు చూడడం గతం లో కూడా ఎప్పుడూ జరగలేదు..అంతే కాకుండా యాష్ ని కన్నడ లో రాజకీయ నాయకులూ కూడా ఎన్నికల ప్రచారం కోసం బాగా వాడుతుంటారు..బీజేపీ కి ఆయన పలుసార్లు కర్ణాటక లో ప్రచార బాధ్యతలను చేపట్టాడు..ఇప్పుడు ఆయన పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కాబట్టి అతని కోసం..అతని సేవల కోసం మన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం ప్రయత్నిస్తుందా అంటే అవుననే చెప్తున్నారు విశ్లేషకులు.

ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ లో దిగిన యాష్ ని కలవడానికి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ వెళ్ళాడు..అక్కడ యాష్ తో లోకేష్ సుమారుగా 30 నిమిషాల పాటు సుదీర్ఘ చర్చలు జరిపాడు..నేను చంద్రబాబు నాయుడు కొడుకుని అంటూ తనని తాను యాష్ కి పరిచయం చేసుకొని మాట్లాడడం ప్రారంభించాడు నారా లోకేష్..యాష్ కూడా ఆయనకీ ఎంతో గౌరవమిస్తూ ముచ్చటించారు.

KGF హీరో ని ప్రత్యేకంగా కలిసి అంతసేపు సుదీర్ఘ చర్చలు చెయ్యాల్సిన అవసరం ఏమిటి..?అతనిని ఎన్నికల ప్రచారం కోసం వాడేందుకు ప్రయత్నిస్తున్నారా..మన టాలీవుడ్ హీరోలు విస్తృతంగా ప్రచారం చేస్తేనే ఓట్లు పడుతాయో లేదో అనేంత పరిస్థితి ఉన్న నేటి కాలం లో , కన్నడ హీరో వచ్చి ఓట్లు వెయ్యమని చెప్తే జనాలు వింటారా..? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి..ఇంతకీ వీళ్లిద్దరి భేటీ ఎందుకు జరిగింది అనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.