Nandamuri Balakrishna- Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని తెలుగుదేశం నాయకులు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు పార్టీ అభ్యర్థులుగా ఖరారైన వారు మాత్రం నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. గ్రౌండ్ లెవల్ లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఆహారం, ఆరోగ్యం అన్న నినాదంతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్లతో పేదలకు తక్కువ మొత్తానికే ఆహారం అందేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్న క్యాంటీన్లను రద్దుచేసింది. దీంతో ప్రజలకు మంచి ఆహారం దొరక్కుండా చేసిందని టీడీపీ విమర్శలు చేయడం ప్రారంభించింది. అటు టీడీపీయే నేరుగా దాతల సహకారంతో అన్నక్యాంటీన్లను రన్ చేస్తోంది. దీంతో వీటికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోంది. అదే సమయంలో వైసీపీ సర్కారు వ్యవహరించిన తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. దీంతో అన్న క్యాంటీన్లను మరింత ఎక్కువగా ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తమ సొంత నిధులతో పాటు దాతల సహకారంతో వాటిని ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా..
ఈ విషయంలో మామా అల్లుడు నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ముందు వరుసలో ఉన్నారు. హిందూపురంలో మూడో సారి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని బాలకృష్ణ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు. సినిమా షూటింగులు లేనప్పుడు స్థానికంగా అందుబాటులో ఉంటూ గ్రౌండ్ ప్రిపేరు చేసుకుంటున్నారు. అటు మంగళగిరిపై నారా లోకేష్ దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి బరిలో దిగిన లోకేష్ ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు ప్రతయ్నిస్తునే ఉన్నారు. దీనికితోడు రాజధాని సెంటిమెంట్ రగులుతుండడంతో లోకేష్ ప్రయత్నాలు వర్కవుట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతం కంటే లోకేష్ కు ఆదరణ పెరగడంతో పాటు సానుభూతి వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ బలం చాలదన్నట్టు మామా అల్లుళ్లు కొత్తగా వినూత్న కార్యక్రమాలపై ఫోకస్ పెంచారు.
Also Read: CPS Scheme: సరిగ్గా సీపీఎస్ రద్దు అప్పుడా? వైసీపీ సర్కారు భలే స్కెచ్
అన్నక్యాంటీన్లు, ఆరోగ్యరథాలు..
మంగళగిరిలో లోకేష్ అన్నక్యాంటీన్లు, ఆరోగ్య రథాల సేవలను వినియోగిస్తున్నారు. అన్నక్యాంటీన్ల వద్ద నిత్యం జనం కనిపిస్తున్నారు. మరోవైపు నాలుగు ఆరోగ్య రథాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆరోగ్య రథం రోజుకో గ్రామానికి తిరుగుతుంది. వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రులకు రిపర్ చేస్తారు. అక్కడ తక్కువ మొత్తానికే వైద్యం అందేలా చూస్తారు. దీంతో ఆరోగ్యరథానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తొంది. ఇప్పటికే వైద్యులు, సిబ్బంది లేక 104 సేవలు నిలిచిపోయాయి. అటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం మెరుగైన సేవలందడం లేదు. ఈ నేపథ్యంలో లోకేష్ ఏర్పాటుచేసిన ఆరోగ్య రథాలు వర్కవుట్ అవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను అన్న క్యాంటీన్లు, రైతు రథాలు గుర్తుకు తెస్తున్నాయి. అందుకే మరిన్న క్యాంటీన్లు, రథాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆ ప్రయోగంతోనే ముందుకు..
లోకేష్ మంగళగిరిలో చేసిన ప్రయోగాన్నే హిందూపురంలో బాలకృష్ణ అనుసరిస్తున్నారు. ఇప్పటికే హిందూపురంలో వరుసగా అన్నక్యాంటీన్లను బాలకృష్ణ ప్రారంభించారు. దాతల సహకారంతో నిర్విగ్నంగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆరోగ్య రథాలను సైతం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక రథాన్ని అందుబాటులోకి తెచ్చారు. అది మెరుగైన సేవలందిస్తోంది. దీంతో త్వరలో మరో రెండు రథాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో మండలానికి ఒకటి చొప్పున కేటాయించేందుకు కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే మామా అల్లుళ్లు నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు వర్కవుట్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు సైతం ఇదే పంథాను అనుసరించనున్నట్టు తెలుస్తోంది.
Also Read:MP Gorantla Madhav-TDP: బాబు ఆడియో మాటేమిటి? టీడీపీ ఆరోపణలపై ఎంపీ మాధవ్ కౌంటర్