Homeఆంధ్రప్రదేశ్‌JanaSena Alone Fight: జనసేన ఒంటరి పోరుకు నాగబాబు స్కెచ్.. ఆయన వెనుక ఎవరున్నారు?

JanaSena Alone Fight: జనసేన ఒంటరి పోరుకు నాగబాబు స్కెచ్.. ఆయన వెనుక ఎవరున్నారు?

JanaSena Alone Fight: వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇందుకుగాను మెగా బ్రదర్ నాగబాబును పావుగా వాడుకుంటున్నారా? అందులో భాగంగానే ఆయన మెగా ఫ్యాన్స్ లో ఒక రకమైన గందరగోళ పరిస్థితులను ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒక వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోనని పవన్ కళ్యాణ్ పొత్తులపై విస్పష్ట ప్రకటన చేశారు. తాను పొత్తులకు సిద్ధమేనని సంకేతాలు పంపారు. అయితే పవన్ కూటమి కడితే తమకు కష్టమని భావిస్తున్న వైసీపీ పవన్ ను ఒంటరిగానే పోటీ చేయాలని ప్రయత్నిస్తోంది. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి వచ్చే ఎన్నికల్లో మరోసారి పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. అందుకే పవన్ కల్యాణ్‌ను ఎలాగైనా ఒంటిరిగా పోటీ చేయించేలా చూడాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నాగబాబు కూడా చేరినట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఆయన మెగా ఫ్యాన్స్‌ను దువ్వుతున్నారు. మెగా ఫ్యాన్స్ వ్యవహారాలను చక్కబెట్టే స్వామినాయుడుతో విజయవాడలో ఫ్యాన్స్ సమావేశం వెనుక నాగబాబు ఉన్నారని టాక్ నడుస్తొంది.

JanaSena Alone Fight
Nagendra Babu

పొత్తు చిత్తు చేయాలనే..
పొత్తు చిత్తు చేయాలన్న నెపంతో వ్యూహాత్మకంగా పవన్ సీఎం అభ్యర్థి అంటూ తెరపైకి తెస్తున్నారు. సాక్షాత్ వైసీపీ మంత్రుల నుంచి కూడా పవన్ విషయంలో ఇటువంటి మాటే వినిపిస్తోంది. దమ్ముంటే చంద్రబాబు పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని సవాల్ విసురుతున్నారు. నాగబాబు కూడా ఇదే తరహా అభిప్రాయంతో ఉన్నారు. కానీ బయటపడడం లేదు. ఆయన తమ్ముడు పవన్ మీద అభిమానంతో ఆ మాట అంటున్నారో.. లేక పొత్తుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలనుకున్నారో తెలియడం లేదని జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: Vijay Sai Reddy Impress Delhi BJP: బీజేపీ అగ్ర నాయకత్వం ప్రాపకం కోసం పరితపిస్తున్న విజయసాయిరెడ్డి

ఇటీవల ఫ్యాన్స్‌తో పదే పదే ఇంటరియాక్ట్ అవుతున్న నాగబాబు.. పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అయితేనే పొత్తులకు ఒప్పుకుంటామని చెబుతున్నారు. ఆ మాటలను ఇతర ఫ్యాన్స్ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో జరిగిన ఫ్యాన్స్ మీటింగ్ సారాంశం కూడా అదే. పొత్తులు ఉన్నా లేకపోయినా పవన‌్ సీఎం అభ్యర్థి అని చెబుతున్నారు. ఇదంతా ఆర్గనైడ్జ్‌గా జరుగుతోందని పొత్తులు పెట్టుకోకుండా చూసే వ్యూహంలో భాగం అవుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

JanaSena Alone Fight
Nagendra Babu, pawan kalyan

శ్రేణుల్లో ఆందోళన..
గత అనుభవాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని జనసేన శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పార్టీలో మారుతున్న పరిణామాలతో జనసేన ముఖ్యనేతల్లోనూ సందేహాలు ప్రారంభమయ్యాయి. నాగబాబు, ఫ్యాన్స్ మాత్రమే ఈ వాదన ఎక్కువ వినిపిస్తున్నారు. అసలు పొత్తుల గురించి ప్రాథమికంగా చర్చ జరగకుండానే ఇదంతా ఎందుకు చేస్తున్నారన్న సందేహాలు నెలకొన్నాయి. . బీజేపీ తరహాలోనే జనసేనలోనూ రెండు వర్గాలున్నాయని చెబుతున్నారు. అందులో ఓ వర్గం పూర్తిగా ప్రో వైసీపీ తరహాలో వ్యవహరిస్తున్నాయని.. అంతర్గత నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవనే సీఎం అని ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడానికి నాగబాబు వెనుక ఎవరిదైనా ప్రోత్సహం ఉందో లేదో కానీ.. ఆయన ప్రయత్నాలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి.

Also Read:KCR- National Politics: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తారా?
Recommended videos

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular