Nadendla Manohar- Union Budget 2023: కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతికి ఆర్థికపరంగా ఊరటను కలిగిస్తుందని నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యంగా ఆదాయ పన్ను విషయంలో ఇచ్చిన రాయితీలు, శ్లాబుల మార్పులు ఉద్యోగ వర్గాలకు సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే మహిళలు, వృద్ధుల పొదుపు పథకాలకు ఇచ్చిన రాయితీలు ఆయా వర్గాల్లో పొదుపు ఆసక్తిని పెంచుతాయి. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 11 శాతం పెంచడం రైతాంగానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే చిరు ధాన్యాలకు ప్రాధాన్యం పెరిగేలా ప్రత్యేక పథకం తీసుకురావడం మంచి పరిణామం.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో అందరి కంటే ‘ఎ క్లాస్’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దేశంలోని ముఖ్యమంత్రుల సంపద మొత్తం కలిపినా అంతకంటే ఎక్కువ సంపద ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రికే ఉంటుంది అన్నారు.
1) ఆక్సిమొరాన్ (నామవాచకం) – అర్థం – పొంతనలేని పదాల కలయిక
ఉదాః నిరుపేద ప్రజలు నివసించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ధనిక ముఖ్యమంత్రి అన్న చందంగా..
సూక్ష్మార్ధం: మన ముఖ్యమంత్రి సంపద ఎంతంటే దేశ ముఖ్యమంత్రుల సంపద మొత్తం కలిపినా అంత కన్నా ఎక్కువే.. అందుకే ఏపీ సీఎం, అందరికంటే ‘ఏ క్లాస్!’
2) ఆంధ్రప్రదేశ్‌లో సంపద ఉన్నవారు, లేనివారు అనే క్లాసులు లేనే లేవు. ఎందుకంటే వైసీపీ క్రూరత్వంతో రాష్ట్ర ప్రజలను బానిసలుగా మార్చింది.
భూముల నుంచి ఇసుక వరకూ… మద్యం నుంచి మైన్స్ వరకూ.. అడవుల నుంచి కొండల వరకూ.. పేపర్ నుంచి ఎర్రచందనం వరకూ.. రాష్ట్రం నుంచి వచ్చే ప్రతీ పైసా మన సంపన్న ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది… కాబట్టి.. ఆయన నిజంగా ‘క్లాసిక్’.
3) ఏపీలోని పేద ప్రజలను దీనాతిదీనులుగా వైసీపీ మిగిల్చింది. వారి జీవితాలను, ఆత్మ గౌరవాన్ని, కష్టాన్ని కేవలం కొన్ని వందల రూపాయల బిచ్చంతో అమ్మేసింది!
ఏపీలోని మధ్యతరగతి ప్రజలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వారిని పన్ను చెల్లించే నోరెత్తలేని సేవకులుగా పరిగణిస్తోంది!
ఏపీ నుంచి పెట్టుబడిదారులు పారిపోతున్నారు.