https://oktelugu.com/

Mudragada Padmanabham : చంద్రబాబు కుట్రదారు.. పవన్ పై బాంబు పేల్చిన ముద్రగడ

కాపు ఓటర్లను జగన్ వైపు టర్న్ చెయ్యాలని భావిస్తున్నారు. అందుకే కాపుల్లో చీలిక వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. పనిలో పనిగా చంద్రబాబు హయాంలో కాపులకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తున్నారు. కూటమి చంద్రబాబు ప్రయోజనాల కోసమేనని కాపులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : March 25, 2024 / 05:06 PM IST

    Chandrababu, Pawan Kalyan , Mudragada

    Follow us on

    Mudragada Padmanabham : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తన పనిని మొదలుపెట్టారు. జగన్ ఇచ్చిన టాస్క్ ను ప్రారంభించారు. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేసుకున్నారు. వైసీపీకి మద్దతుగా కాపులను సమీకరించే ప్రయత్నంలో ఉన్నారు. కొద్దిరోజుల కిందట ముద్రగడ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కానీ ఎక్కడా ముద్రగడ కుటుంబ సభ్యులకు టికెట్లు దక్కలేదు. అయితే మరోసారి జగన్ ను సీఎం చేసేందుకు తాను కృషి చేస్తానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన పదవిని తీసుకుంటానని ముద్రగడ ప్రకటించారు. అయితే ముద్రగడ గత ఎన్నికలకు ముందు నుంచే జగన్ కోసం పనిచేస్తున్నారని.. ఆయనకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కాకినాడ జిల్లా గొల్లప్రోలు కాపు నేతలతో సమావేశమైన ముద్రగడ చంద్రబాబుతో పాటు పవన్ పై విరుచుకుపడ్డారు. ఆ ఇద్దరు నేతలను టార్గెట్ చేసుకున్నారు.

    కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని ముద్రగడ ఆరోపించారు. 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం వల్లే ఉద్యమం చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా రోడ్డెక్కే పరిస్థితిని చంద్రబాబు కల్పించారని ఆరోపించారు. కాపు ఉద్యమంలో కేసులు ఎదురైనా, దాడులు ఎదురైనా పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు పక్కనుంచి పవన్ కళ్యాణ్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదని ఎద్దేవా చేశారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిఠాపురం నుంచి లక్ష కోట్ల మెజారిటీతో గెలుస్తానని చెబుతున్న పవన్.. అక్కడ ఓటర్లు అమ్ముడు పోతారని అభిప్రాయం వ్యక్తంచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

    అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయని ముద్రగడ చంద్రబాబుతో పాటు పవన్ ను టార్గెట్ చేశారు. ఎన్నికల వరకు ఈ తరహా విమర్శలు కొనసాగుతాయని సంకేతాలు ఇచ్చారు. జనసేనలోకి ఆహ్వానించినట్టే చేసి పవన్ పట్టించుకోకపోవడంతో ముద్రగడ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అందుకే పవన్ ను కాపుల నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. కాపు ఓటర్లను జగన్ వైపు టర్న్ చెయ్యాలని భావిస్తున్నారు. అందుకే కాపుల్లో చీలిక వచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. పనిలో పనిగా చంద్రబాబు హయాంలో కాపులకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తున్నారు. కూటమి చంద్రబాబు ప్రయోజనాల కోసమేనని కాపులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.