ఏపీని వదిలి చెన్నైకి మకాం మార్చిన ఎంపీ.. అందుకేనా

వైసీపీలో 24 మంది ఎంపీలున్నప్పటికీ ఏనాడూ పెద్దగా వాళ్ల యాక్టివ్‌ రోల్‌ కనిపించదు. కేవలం మీడియా ముందుకు వచ్చి అటెండెన్స్‌ మాత్రం వేయించుకుంటూ ఉంటారు. అటు పార్లమెంట్‌లోనూ కేవలం విజయసాయిరెడ్డి తప్ప ఎవరూ పెద్దగా వాయిస్‌ వినిపించినట్లు కనిపించదు. అయితే.. అందరి పరిస్థితి ఏమో కానీ ఒంగోలు ఎంపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు టీడీపీ టిక్కెట్ ఇచ్చినా.. వైసీపీ ఒత్తిడితో ఆ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. […]

Written By: Srinivas, Updated On : April 8, 2021 2:38 pm
Follow us on


వైసీపీలో 24 మంది ఎంపీలున్నప్పటికీ ఏనాడూ పెద్దగా వాళ్ల యాక్టివ్‌ రోల్‌ కనిపించదు. కేవలం మీడియా ముందుకు వచ్చి అటెండెన్స్‌ మాత్రం వేయించుకుంటూ ఉంటారు. అటు పార్లమెంట్‌లోనూ కేవలం విజయసాయిరెడ్డి తప్ప ఎవరూ పెద్దగా వాయిస్‌ వినిపించినట్లు కనిపించదు. అయితే.. అందరి పరిస్థితి ఏమో కానీ ఒంగోలు ఎంపీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు టీడీపీ టిక్కెట్ ఇచ్చినా.. వైసీపీ ఒత్తిడితో ఆ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఆ తర్వాత సైలెంటయ్యారు.

ఇటీవల ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చివరికి స్థానిక ఎన్నికల్లోనూ ఆయన ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం పరిషత్ పోలింగ్ జరుగుతున్నా.. ఆయన ఎవరితోనూ టచ్‌లో లేరు. అసలు ఆయన ఏపీలో ఉంటున్నదే తక్కువని ఆయన అనుచరులు చెబుతున్నారు. చెన్నైలోనే చాలా కాలంగా ఉంటున్నారు. పార్టీ అధినేత ఎంపీలు ఎవరూ ఫోకస్ కావడానికి అంగీకరించరు. ఈ కారణంగా ఆయనను మొదట్లోనే నియంత్రించారు. చివరికి.. ఎంపీగా పార్టీలో కూడా ప్రాధాన్యత లేకుండా చేశారు.

ఏ కార్యక్రమాలనైనా జగన్ దగ్గరి బంధువులైన బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైవీ సుబ్బారెడ్డి చేతుల మీదుగానే నడిచిపోతుంటాయి. సుబ్బారెడ్డి కన్ను.. ఎప్పుడూ ఎంపీ సీటు మీదనే ఉంటుంది. అవసరానికి మాగుంటను పిలిపించి టిక్కెట్ ఇచ్చారు కానీ.. రేపు అవసరం లేకపోతే పక్కన పెట్టేస్తారు. ఈ అంశాలన్నీ అర్థమయ్యే మాగుంట సైలెంట్‌ అయ్యారని తెలుస్తోంది. గతంలో ఎంపీగా ఉంటే వారానికి మూడు, నాలుగు రోజులైనా నియోజకవర్గంలో పర్యటించేవారు.

ఇప్పుడు ఎలాగూ పార్టీలో ప్రాధాన్యత లేదు కాబట్టి సైలెంట్‌గా దూరం అయినట్లుగా అర్థమవుతోంది. ఏపీలో లిక్కర్ వ్యాపారాన్ని జగన్ దెబ్బతీయడం.. పాత బకాయిలు ఏమీ చెల్లించకపోవడం కూడా మాగుంట ఆసంతృప్తికి మరో కారణంగా చెప్తున్నారు. మాగుంటకు బేవరేజెస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రఖ్యాత బ్రాండ్ల మద్యం ఉత్పత్తి చేస్తుంటారు. వీటి అమ్మకాలను ఏపీలో చేయడం లేదు. అలాగే గత ప్రభుత్వంలో సరఫరా చేసిన వాటికి చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ రెండూ కూడా చేయడం లేదు. దీంతో మాగుంట జగన్ వ్యూహాత్మకంగా తన వ్యాపారాన్ని కూడా దెబ్బకొడుతున్నారని భావించి.. ఆయన చెన్నైలో ఉండి వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారని చెబుతున్నారు.