Modi declared war on corruption : దేశంలో ప్రాంతీయ పార్టీల బలహీనతనే బీజేపీ బలం. అవి అవినీతిలో కూరుకుపోవడమే బీజేపీకి ఆయుధం. తోకజాడించే ప్రాంతీయ పార్టీలు, నేతలపై ‘అవినీతి అస్త్రం’ ప్రయోగిస్తోంది బీజేపీ. దానికి ఎవరూ మినహాయంపు కావడం లేదు.తమిళనాడు సీఎం స్టాలిన్ కాంగ్రెస్ వాదిగా బీజేపీని తూర్పారపడుతారు. తమిళనాడుకు వచ్చిన మోడీని వేదికపైనే నిలదీసిన పెద్దమనిషి.. కానీ కట్ చేస్తే దుబాయ్ లో ఆయన కంపెనీ హవాలా లావాదేవీలను ఈడీ బయటకు తీయడంతో పరుగు పరుగున ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల శరణు వేడారు.
ఇక జార్ఖండ్ లోనూ ఇదే కథ. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీపై తొడగొట్టిన సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి కుర్చీకే బీజేపీ ఎసరు తెచ్చింది. బొగ్గు గనుల కేటాయింపు స్కాంలో ఆయన ఎమ్మెల్యే పోస్టుపై అనర్హత వేటు వేసింది. ఇలా ప్రత్యర్థుల అవినీతియే బీజేపీ బలంగా మారుతోంది.
తెలంగాణలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న కేసీఆర్ ను అదునుచూసి దెబ్బకొట్టింది బీజేపీ. మొన్నటికి మొన్న ‘ఈడీనా.. బోడీనా’ దమ్ముంటే రమ్మను.. అంటూ కేసీఆర్ సవాల్ చేశారు. ఇక మోడీని గోకుతానంటూ బీరాలు పలికాడు. కానీ మోడీ , అమిత్ షాలు స్పందించలేదు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం బయటపడ్డాక.. కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసీఆర్ కూతురు కవిత ఈ స్కాంలో ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. పాలకు పాలు.. మద్యానికి మద్యం అంటూ బీజేపీ నేతల మాటలకు కవిత ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
అవినీతిపై యుద్ధం ప్రకటించిన మోడీ, మరి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వ అవినీతి విషయంలో ఎందుకు సీరియస్ గా స్పందించడం లేదు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.